ఎక్స్‌ క్లూజివ్‌: కిక్‌ 2 హైలైట్స్‌

Update: 2015-08-19 12:26 GMT
మాస్‌ మహారాజ్‌ రవితేజ కి ఆ పేరు రావడానికి కారణం హరీష్‌ శంకర్‌. ఆయన ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టాడో కానీ, ఆ రోజు నుంచి అదే పాపులర్‌ అయిపోయింది. దాన్నే టైటిల్స్‌ లోనూ వేస్తున్నారు. ఇప్పుడు అదే మాస్‌ బీట్‌ లో కిక్‌ 2 రిలీజ్‌ కి వస్తోంది. ఈ సందర్భంగా రవితేజ చెప్పిన హైలైట్స్‌ ఇవి.... ఎక్స్‌ క్లూజివ్‌ గా మీకోసం...

=కిక్‌ కథ వేరు. కిక్‌ 2 కథ వేరు. రెండూ డిఫరెంట్‌ స్టోరీస్‌. క్యారెక్టర్‌ షేడ్‌ మాత్రమే ఒకేలా ఉంటుంది.

=ఓ వ్యక్తి తన కంఫర్ట్‌ కోసం కథని ఎలా నడిపించాడన్నదే సినిమా. కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్‌ తో తెరకెక్కించిన సినిమా. రాబిన్‌ హుడ్‌ తరహాలో కనిపిస్తా.

=కిక్‌ చేసేప్పుడు కిక్‌ 2 చేయాలనుకోలేదు. కాకపోతే ఎండింగ్‌ ని బట్టి కిక్‌ 2 ఉంటుందని అంతా అంచనా వేశారు.అదే ప్రచారమైంది. ప్రచారమైందే నిజమైంది. వక్కంతం వంశీ చెప్పిన ఓ లైన్‌ ఆకట్టుకుంది. దాన్నే డెవలప్‌ చేస్తే కిక్‌ 2 అయ్యింది. అదీ సంగతి.

= అవన్నీ వట్టిదే. వాళ్లు నచ్చినట్టు హ్యాపీగా మాట్లాడుకుంటున్నది చూస్తూనే ఉన్నాంగా. ఏ ఇద్దరి మధ్య చర్చ జరిగినా చిలువలు పలవలు చేసి, మూడోవాడు ప్రచారం చేయడం సినీరంగంలో ఎక్కువ.

= ఓ కమర్షియల్‌ సినిమాకి దర్శకత్వం వహించాలని ఉంది. అయితే అందులో నేను నటించను. వేరే హీరోతో చేస్తా. అప్పట్లో నేను రాసుకున్న స్క్రిప్టు లన్నీ అలానే ఉన్నాయి. అవేవీ సినిమాలుగా రాలేదు. వాటినే తీస్తా.

కిక్‌ 2లో వినోదం, యాక్షన్‌ అన్నీ ఎక్కువే. నార్తిండియా నేపథ్యం, కిక్‌ లోని హీరో పాత్ర కళ్యాణ్‌ కు రాబిన్‌ హుడ్‌ అనే కొడుకుంటే అనే ఆలోచన తోనే చేశాం తప్ప కిక్‌ కి ఇది సీక్వెల్‌ కాదు.

=సురేందర్‌ రెడ్డి పెర్ఫెక్షనిస్ట్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, డిఐ, వగైరా ఆలస్యమవ్వడం వల్ల, బాహుబలి రిలీజ్‌ తేదీ మారడం వల్ల మా ప్లాన్‌ మార్చుకోవాల్సొచ్చింది.

=సురేందర్‌ రెడ్డి అసిస్టెంట్‌ దర్శకుడిగా ఉన్నప్పట్నుంచి నాకు తెలుసు. గతంలో సీరియస్‌ సినిమాలు తీసే ఆయన ఇప్పుడు కామెడీ జోనర్‌ రుచి మరిగాడు. కిక్‌, రేసుగుర్రం, కిక్‌ 2 ఆ జోనర్‌ లోనే తీశాడు.

=బ్రహ్మానందం ఇందులో పండిత్‌ రవితేజ అనే (నా పేరు ఉంది) క్యారెక్టర్‌ చేస్తున్నాడు. బోలెడంత కామెడీ చేశాడు.

=రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ అందం అస్సెట్‌. తను నటించిన సినిమాలన్నీ బాగానే ఆడుతున్నాయి. ఇదీ ఆడుతుంది.

=మనోజ్‌ పరమహంస కెమెరా, తమన్‌ సంగీతం పెద్ద అస్సెట్స్‌ మా సినిమాకి.

=కిక్‌ 2 అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా అయ్యాక తప్పకుండా కిక్‌3 కూడా చేస్తాను.

=బెంగాళ్‌ టైగర్‌ పూర్తవుతోంది. అక్టోబర్‌ లో రిలీజ్‌.

=ఈ సినిమా కోసమే బరువు తగ్గలేదు. ఆరోగ్యం కోసం బరువు తగ్గాను. 82 కేజీల నుంచి 72 కేజీలకు తగ్గా. ఆ ప్రాసెస్‌ లో ఉండగా కిక్‌2 సెట్స్‌ కెళ్లింది .. కాబట్టి తక్కువ బరువుతో కనిపించానంతే.
Tags:    

Similar News