ధమాకా.. రిస్క్ లేకుండా రవితేజ రెమ్యునరేషన్

Update: 2022-12-12 02:30 GMT
మాస్ మహారాజ రవితేజ బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాతో సక్సెస్ అందుకుంటే మళ్ళీ వెంటనే వరుసగా కొన్ని డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇక మధ్యలో అతనికి వరుసగా కొన్ని సినిమాలు దారుణంగా నష్టాలు కలుగజేయడంతో నిర్మాతలు ఇచ్చిన కమిట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే రవితేజ అలా ఆఫర్స్ పోకుండా ఉండడానికి తనపై పెట్టుబడి పెట్టి నిర్మాతలకు మంచి ఆఫర్ అయితే ఇచ్చాడు.

సినిమా బిజినెస్ తర్వాత చూసుకుందామని ముందు సినిమాకు కావాల్సింది చేయాలి అనే విధంగా నిర్మతలతో మాట్లాదుకుంటు వచ్చాడు. క్రాక్ అనే సినిమా అలానే పూర్తి చేశాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా ఆ సినిమాకు మొదట రవితేజకు నాలుగు నుంచి ఐదు కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నారు.

కానీ అలా కాకుండా సక్సెస్ వచ్చిన తర్వాత షేర్ పర్సంటేజ్ మాట్లాడుకోవడంతో రవితేజకు దాదాపు 15 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. అయితే ఆ తర్వాత అదే తరహాలో రవితేజ ఖిలాడి సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కూడా షేర్ డీల్ మాట్లాడుకున్నారు. సొంతంగా బ్యానర్ కూడా స్థాపించాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా దారుణంగా నష్టాలను కలుగజేసాయి.

అయితే ఇప్పుడు కూడా ధమాకా సినిమాకు ఆ తరహాలో ఆఫర్ రావడంతో రవితేజ రిస్క్ చేయలేదని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సినిమాకు రవితేజ సైలెంట్ గా రెమ్యునరేషన్ తీసుకుని సైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా తర్వాత అసలైతే రవితేజ ఒక సినిమాకు ఏడు కోట్ల వరకు డిమాండ్ చేయాలని అనుకున్నాడు.

అయితే పీపుల్స్ వీడియో కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రవితేజకు బిజినెస్ లో అయితే వాటా లేదు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా కారణంగా రవితేజ చాలా నష్టపోయాడు.

ఇక మళ్లీ ఆ దెబ్బ రిపీట్ కాకూడదు కానీ ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా రవితేజ అసలు ఇన్వాల్వ్ కాలేదని తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు ఎలాంటి కలెక్షన్స్ అందిస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News