రవితేజ, సురేందర్ రెడ్డి తొలిసారి జత కట్టినపుడు ‘కిక్’ అనే టైటిల్ పెడితే అందరూ ఆశ్చర్యంగా చూశారు.. ఏంటీ టైటిల్ అని. తెరమీద హీరో ఎంత సేపూ కిక్కు కిక్కు అని కొట్టుకుంటుంటే.. ఏంటీ కళ్యాణ్ గాడి గోల అనుకున్నారు. మొదట్లో కొంచెం సిల్లీగా అనిపించినా.. సినిమా ముందుకు సాగే కొద్దీ వినోదపు కిక్కులో నిండా మునిగిపోయారు ప్రేక్షకులు. తెలుగు సినిమాల్లో చాలా విచిత్రమైన హీరో క్యారెక్టరైజేషన్స్ లో ఇదొకటిగా నిలిచిపోయింది. ఆ తర్వాత ‘కిక్’ స్ఫూర్తితో బోలెడన్ని సినిమాలొచ్చాయి టాలీవుడ్ లో. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. అదే.. కిక్-2. ఐతే ఇది సీక్వెల్ అనే కానీ.. ‘కిక్’ గాడి కథ కాదు. ‘కంఫర్ట్’ గాడి కథ.
ఇంతకీ ఈ కంఫర్ట్ ఎవడు అనుకుంటున్నారా.. అదేనండీ మన ‘కిక్’ గాడి కొడుకు. ఫస్ట్ పార్ట్ లో హీరో కిక్కు కోసం జనాల జీవితాలతో ఆడేసుకుంటే.. రెండో పార్ట్ లో కథానాయకుడు కంఫర్ట్ కోసం ఏదైనా చేసేస్తాడన్నమాట. మళ్లీ అతడికి బ్రహ్మి రూపంలో బకరా దొరికాడు. అతణ్ని కంఫర్ట్ కోసం పిచ్చ పిచ్చగా వాడేసుకుని ఆడేసుకుంటాడన్నమాట. బ్రహ్మి ఏమో నీది కంఫర్ట్ కాదు.. సెల్ఫిష్ నెస్ అంటాడు. కానీ హీరో మాత్రం నాది కంఫర్టే అంటాడు. ట్రైలర్ చూస్తేనే రవితేజ, బ్రహ్మిల మధ్య కెమిస్ట్రీ మళ్లీ కిక్ స్థాయిలో పండిందని అర్థమవుతోంది. తొలి భాగంతో ‘కిక్’ అనే పదం ఎంత పాపులరైందో.. కిక్-2తో ‘కంఫర్ట్’ కూడా అంతే చర్చనీయాంశమవుతుందని రచయిత వక్కంతం వంశీ, డైరెక్టర్ సురేందర్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు. మధ్యలో ఒక్క రోజే గ్యాప్ ఉంది.. కిక్-2 రావడానికి. శుక్రవారం నుంచి సందడే సందడి.