మాస్ మ‌హారాజా మ‌రో సాహ‌సం!

Update: 2020-01-19 05:33 GMT
టాలీవుడ్ హీరోలంతా ఇటీవ‌ల నిర్మాత‌లుగానూ రాణిస్తారు. పారితోషికాలు - ప్యాకేజీల్ని పెట్టుబ‌డులుగా పెడుతూ త‌మ‌వంతు బాధ్య‌త‌ల్ని స్వీక‌రిస్తున్నారు. ముందే పారితోషికాలు తీసుకోకుండా వాటిని పెట్టుబ‌డికి మ‌ళ్లించ‌డం అన్న అన‌వాయితీ అల‌వాటైంది. పారితోషికాల్ని పెట్టుబ‌డి పెట్టి లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. కొంద‌రు సొంత సొమ్ముల్ని అవ‌స‌రం మేర పెట్టుబ‌డుల సాయం చేస్తున్నారు. ఇక ర‌కంగా ఇన్వెస్ట‌ర్స్ గా కొత్త అవ‌తారం ఎత్తుతున్నార‌నే చెప్పాలి.

టాలీవుడ్ టాప్ 10 స్టార్లు ఇప్ప‌టికే నిర్మాత‌లుగా సినిమాలు చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్.. రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌భాస్.. నాని వీళ్లంతా ఇప్ప‌టికే నిర్మాత‌లు. జింఎబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించి ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత‌ల‌తో టై అప్  అయి మ‌హేష్‌ సినిమాలు నిర్మిస్తున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల‌ను త‌న బ్యాన‌ర్ లో నిర్మించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇంకా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ స్థాపించి చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక నేచుర‌ల్ స్టార్ నాని `ఆ ` సినిమాతో నిర్మాత‌గా మారాడు. మంచి ప్ర‌తిభ‌ను... స్క్రిప్టుల‌ను ఎంక‌రేజ్ చేసేందుకే వాల్ పోస్ట‌ర్ సినిమాస్ బ్యానర్ ని స్థాపించి అ చిత్రాన్ని నిర్మించి స‌క్సెస్  అందుకున్నాడు. క‌థ న‌చ్చితే కొత్త ట్యాలెంట్ ను ఎంక‌రేజ్ చేయ‌డంలో ముందుంటున్నాడు.  ఇంకా చాలా మంది సీనియ‌ర్ హీరోలు నిర్మాత‌లుగా రాణిస్తున్నారు. మీడియం రేంజ్  హీరోలు సినిమా ప్రారంభానికి ముందు రూపాయి పారితోషికం అయినా తీసుకోకుండా హిట్టు అయితే వ‌చ్చిన లాభాల్లో ప‌ర్సంటేజ్ తీసుకుంటున్నారు.

తాజాగా మాస్ రాజా ర‌వితేజ కూడా ఇదే బాట‌లో  వెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడు. అగ్రిమెంట్ కు ముందు పైసా తీసుకోకుండా త‌న పారితోషికాన్ని పెట్టుబ‌డిగా పెట్టి స్లీపింగ్ పార్ట‌న‌ర్ కాబోతున్నాడుట‌. అలాగే సొంతంగా ఓ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి అందులో ప‌రిమిత‌ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించి ఔత్సాహికుల‌ను ప్రోత్స‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. మాస్ రాజా మైండ్ లో ప్ర‌స్తుతానికి ఈ రెండు ఆలోచ‌న‌లో ఉన్నాయ‌ని తెలుస్తోంది. అయితే రాజా స్వ‌యంగా ఈ విష‌యాన్ని ధృవీక‌రించాల్సి ఉంది.


Tags:    

Similar News