మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న చెర్రీ.. రెట్టింపు ఉత్సాహంతో #RC15 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా RC15 నేపథ్యాన్ని హీరో రాంచరణ్ రివీల్ చేశారు. శంకర్ తో చేస్తున్న సినిమాకథ మన సమాజానికి స్ఫూర్తినిచ్చిన ఎందరో నిజాయితీ గల అధికారులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సొసైటీలో ఎంతో కొంత భాగం పంచుకోడానికి రాబోయే సినిమాల్లో ఇలాంటి పాత్రలే చేస్తానని చరణ్ తెలిపారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''ధ్రువ సినిమాలో పోలీసు అధికారిగా నటించడం గర్వంగా ఉంది. శంకర్ గారితో చేస్తున్న నా అప్ కమింగ్ ఫిల్మ్ కూడా అలానే ఉంటుంది'' అని అన్నారు.
''ఈ సమాజంలో మనల్ని ఇస్పైర్ చేసిన ఎందరో ఆఫీసర్స్ ఆధారంగా రూపొందుతోంది. ఈ సమాజంలో భాగం పంచుకోడానికి రాబోయే చిత్రాల్లోనూ అలాంటి పాత్రలు చేయడాన్ని కొనసాగిస్తాను'' అని చెర్రీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను - అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
''దేశ భద్రతను కాపాడుతున్న సైనికుల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టం. మనం ఇక్కడ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు.. జవాన్ల త్యాగాలే దానికి కారణం. వారి ధైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం నడిచే నేల, పీల్చే గాలీ, బతుకుతున్న దేశం మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుంది. వీరుల త్యాగాలను ఎవరు మరిచిపోవద్దు. దేశం ప్రశాంతంగా ఉందంటే అది మన సైనికుల వలనే'' అని రామ్ చరణ్ అన్నారు.
'RC15' లో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర అని ఇప్పటికే లీకైన పిక్స్ తో క్లారిటీ వచ్చింది. మరొకటి రాజకీయాలను ప్రక్షాళన చేసే ఓ ప్రభుత్వోద్యోగి పాత్ర అని తెలుస్తోంది. ఇప్పుడు చెర్రీ స్పీచ్ ని బట్టి ఇది నిజమేననిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రానికి 'సర్కారోడు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. ఈ క్రేజీ మూవీ 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.