సీనియర్ టెక్నీషియన్లు మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో పని చేసే ఏ టెక్నీషియన్ కి అయినా కొన్ని సమస్యలుంటాయి. సుదీర్ఘ కాలం చిత్రీకరణలు చేయడం రీషెడ్యూలింగ్ చేయడం వాయిదాలు వివాదాలు అంటూ చాలానే కారణాలుంటాయి. అయితే ఇలాంటి సన్నివేశంతో కొందరు దర్శకులకు కుదరదు. కాల్షీట్ల పరమైన సమస్య తలెత్తుతుంది. ఇప్పుడు ఆర్.సి 15 సినిమాటోగ్రాఫర్ తిరుకి అలాంటి చిక్కులే ఎదురయ్యాయట.
RC15 ఇటీవల ముగిసిన అమృత్ సర్ షెడ్యూల్ ప్రారంభానికి ముందు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు ఈ చిత్రం నుండి వైదొలిగినట్లు ఇప్పుడు ఒక కథనం వరల్ అవుతోంది. తిరు డేట్లు మరొక చిత్రానికి క్లాష్ అయ్యాయని కొందరు అంటున్నారు. ఆపై చరణ్ షెడ్యూల్ కోసం DOP గా రత్నవేలుని తీసుకురావడానికి ఆసక్తిగా ఉన్నాడని.. అతను మిగిలిన పెండింగ్ మూవీ ఆద్యంతం పని చేస్తారనేది గుసగుస.
ఇదిలా ఉండగానే శంకర్ భారతీయ రంగంలో సీనియర్ దర్శకుడని సినిమాటోగ్రాఫర్ ల ఇన్ పుట్ లతో అతను ఖచ్చితంగా విభేదించే అవకాశం ఉందని ..అది ఖచ్చితంగా వారిలో కొందరిని బాధపెడుతుందని పరిశ్రమ అంతర్గత వ్యక్తులు చెబుతుంటారు. తిరు అలాంటిదే ఎదుర్కొంటున్నాడన్న గుసగుస కూడా వినిపిస్తోంది.
ఒకవేళ అతడు విభేధించి వెళ్లినా కానీ రత్నవేలుతో రీప్లేస్ చేస్తే అది లాభించే అంశమే. ఇకపోతే ఆర్.సి 15కి ఆది నుంచి కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవల శంకర్ కోర్టు వివాదాల వల్ల షెడ్యూల్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఎన్ని జరిగినా .. ఎంత ఆలస్యం చేసినా కానీ శంకర్ తో పని చేసేందుకు స్టార్ హీరోలు ఎల్లపుడూ ఆసక్తిగానే ఉంటారు. కేవలం విజువల్ వండర్స్ ని మాత్రమే అందించే శంకర్ తో ఆఫర్ కోసం వేచి చూస్తారనడంలో సందేహం లేదు.. శంకర్ సినిమాలు ఎల్లప్పుడూ అద్భుతమైన విజువల్స్ తో అలరిస్తుంటాయి.
ఔట్ పుట్ యూనిక్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. రోబో - రంగస్థలం విజువల్స్ వెనుక ఉన్న సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ #RC15 టీమ్ తో చేరితే అది లాభించే అంశమే అవుతుంది. రత్నవేలు భారీ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించడంలో స్పెషలిస్ట్ అని ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. జాతీయ అవార్డులు సైతం అతడిని వరించాయి.