థియేటర్లలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల హవా నడుస్తోంది. ట్రిపుల్ ఆర్ నుంచి కేజీఎఫ్ 2 వరకు తెలుగు ఆడియన్స్ కే కాకుండా దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులకు ఈ రెండు చిత్రాలు కనువిందైన వినోదాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్' మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డుల్ని సొంతం చేసుకుంటూ పలు రికార్డుల్ని తుడిచిపెట్టేసింది.
ఇప్పటి వరకు 1100 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ రానున్న రోజుల్లో మరింతగా వసూళ్లని రాబట్టడం ఖాయం అని అంటున్నారు. అయితే 'కేజీఎఫ్ 2' ప్రభావం వల్ల 'ట్రిపుల్ ఆర్' హవా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో కేజీఎఫ్ 2 కారణంగా ట్రిపుల్ ఆర్ వసూళ్లపై ప్రభావం పడింది. అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టలేకపోతోంది. ఇక 'కేజీఎఫ్ 2' ఇప్పటికే 750 కోట్లమార్క్ ని టచ్ చేసింది. హిందీ బెల్ట్ లో మరి కొద్ది రోజుల్లో 300 కోట్ల మార్కుని చేరబోతోంది.
ఇదిలా వుంటే థియేటర్లకు రాకుండా ఇంటి పట్టునే వుంటూ సినిమాలని ఓటీటీల్లో చూడాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గట్టి షాక్ తగలబోతోంది. ఓ విధంగా చెప్పాలంటే రానున్న కొన్ని వారాలు ఓటీటీ ఆడియన్స్ కి బ్యాడ్ డేస్ అని చెప్పొచ్చు. క్రేజీ చిత్రాలని ఓటీటీ వేదికగా చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు మరి కొన్ని వారాలు వేచి చూడాల్సిందే అని అంటున్నారు. ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలని ఓటీటీలో చూడాలని ఎదురుచూస్తున్నారు.
అయితే వారి కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం థియేటర్లలో జోరుగా వసూళ్లని రాబడుతున్న ఈ రెండు చిత్రాలని అంత త్వరగా ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ అంత సుముఖంగా లేదు. దీంతో మరి కొన్ని వారాలు చిన్నా చితకా సినిమాలతో పాటు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఓటీటీ ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సిందే. ఏప్రిల్ 29న తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా అంతంత మాత్రమే వచ్చాయి. దీంతో ఈ సినిమా కోసం ఓటీటీలో జనాలు వెతకడం అంతంత మాత్రమే.
ఇక ఏప్రిల్ 28న 'అన్ చార్టెడ్' ఇంగ్లీష్ మూవీ ఆమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోంది. దీనతో పాటు మరో హాలీవుడ్ ఫిల్మ్ 'ది మాట్రిక్స్ రీసర్కరెక్షన్స్' మే 12న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు క్రేజీ మూవీస్ మాత్రం ఈ టైమ్ లో ఓటీటీ లో రిలీజ్ కావడం లేదు. ట్రిపుల్ ఆర్చ కేజీఎఫ్ రిలీజ్ కావడాలంటే మరి కొన్ని వారాలు వేచి చూడాల్సిందే.
ట్రిపుల్ ఆర్ ని జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. అది ఎప్పుడన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇక 'కేజీఎఫ్ 2' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మే నెలాఖరులో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతున్నా ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. దీంతో తెలుగు ఓటీటీ ఆడియన్స్ తెలుగు క్రేజీ చిత్రాలు ఓటీటీలో చూడాలంటే మరిన్ని వారాలు ఆగాల్సిందేనా అని బావురు మంటున్నారట.