ఆ మచ్చ.. సన్నీతో క్లీన్‌ చేయించాడా?

Update: 2016-01-20 19:30 GMT
దేశంలో మత అసహనం అంటూ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్, గట్టి రాద్ధాంతమే సృష్టించాయి. ఈ ఎఫెక్ట్ నుంచి ఈ హీరో ఇంకా బైట పడలేదు కూడా. ఇప్పటికీ మొహం దాచుకుంటూనే తిరగాల్సి వస్తోంది. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ క్రెడిబుల్ ఇండియా ప్రచారం నుంచి తప్పించడంతో.. పరువు పోయింది అమీర్ కి.

ఈ వ్యవహారం నుంచి తనను తాను బైట వేసుకోవడానికి.. సన్నీ లియోన్ ని ఉపయోగించుకుంటున్నాడు అమీర్ ఖాన్. సన్నీ లియోన్ తో కలిసి నటించేందుకు అభ్యంతరం లేదని చెప్పడం.. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికే అనే కామెంట్స్ వినపడుతున్నాయి. సన్నీని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగినది కరెక్ట్ కాదని.. సన్నీతో నటించేందుకు తనకు ఆమె గతంతో సంబంధం లేదని చెప్పాడు అమీర్.

నిజానికి సన్నీ లియోన్ ఇంటర్వ్యూపై ఇంత త్వరగా స్పందించాల్సిన అవసరం అమీర్ ఖాన్ లాంటి స్టార్ కి లేదు. కానీ అసహనంపై అనవసర వ్యాఖ్యలు చేసి, అందరితో చీవాట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు సడెన్ గా అందరి కంటే ముందు సన్నీ లియోన్ తో నటించేందుకు అభ్యంతరం లేదని చెప్పిన స్టార్ గా ముద్ర వేయించుకుని.. మంచోడు అయిపోయే ప్రయత్నం ఇది అంటున్నారు చాలామంది. ఏమైనా ఓ మరక తుడుచుకునేందుకు..  పోర్న్ స్టార్ పక్కన నటించేందుకు అభ్యంతరం లేదని చెప్పాల్సి వచ్చింది అమీర్ ఖాన్ కి. ప్చ్.. అదే టైం బ్యాడ్ అంటే.
Tags:    

Similar News