అల్లు అర్జున్ కి సమ్మర్ బాగా కలిసొచ్చేసింది. గత కొన్నేళ్లుగా అంటే 2014 రిలీజ్ అయిన రేసుగుర్రం నుంచి.. ప్రతీ సమ్మర్ కి సినిమా విడుదల చేయడం బన్నీకి అనవాయితీ. 2015లో సన్నాఫ్ సత్యమూర్తి.. 2016లో సరైనోడు విడుదల చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. 2017 సమ్మర్ కి డీజేను తీసుకొచ్చేస్తున్నాడని ఇంతకాలం అనుకున్నారంతా.
కానీ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న డీజే- దువ్వాడ జగన్నాధం సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ మే 19న డీజే వస్తుందనే అంచనాలు ఉండగా.. ఇప్పుడీ డీజేను జూలై 7కు పోస్ట్ పోన్ చేసుకున్నారట. మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం.. సమ్మర్ ఎండల్లో షూటింగ్ కి మొగ్గు చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిజానికి డీజే వాయిదా పడ్డానికి అసలు కారణం అల్లు అర్జున్ ఆరోగ్యమే అంటున్నారు.
స్కిన్ ఎలర్జీ కారణంగా.. డీజేకు బన్నీ బ్రేక్ ఇచ్చాడు. ఇంతటి ఎండలలో షూటింగ్ చేయకపోవడానికి కూడా అదే కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. క్లైమాక్స్ విషయంలో బన్నీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రీరైట్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. కారణం ఏదైనా సరే.. సమ్మర్ రేస్ నుంచి బన్నీ తప్పుకున్నాడనే మాట మాత్రం ఖాయమే అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/