ప్చ్.. గొడవెట్టుకుంది మెగా డాటరుతోనా..

Update: 2016-10-14 03:30 GMT
అసలు మెగాస్టార్ చిరంజీవి సినిమా నుండి కాజల్ అగర్వాల్ ను తీసేసినా కూడా.. పెద్దగా రచ్చ జరగదు. ఎందుకంటే అక్కడ మెగాస్టార్ కాబట్టి. కాకపోతే అలా ఒక హీరోయిన్ ను మధ్యలో తప్పించడం అనే కాన్సెప్టును ఇంతవరకు చిరంజీవి ఎప్పుడూ చేయలేదు. కాకపోతే ఇప్పుడు క్యాథరీన్ త్రెసాను షూటింగ్ ముందు తప్పించారు కాబట్టి.. మ్యాటర్ ఏంటా అంటూ కాస్త క్యూరియాసిటీ ఎక్కువైంది.

మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు లారెన్స్ మాష్టర్ చెప్పిన డ్రెస్ వేసుకోకపోవడం.. అలాగే ఆయన చెప్పిన మూవ్మెంట్లు నేర్చుకోకపోవడంతో డస్కీ బ్యూటి క్యాథరీన్ ను తప్పించారనే టాక్ అన్ని చోట్లా వినిపిస్తోంది. అయితే కొందరు మాత్రం వేరే వర్షన్ కూడా చెబుతున్నారు. విషయం ఏంటంటే.. ''ఖైదీ నెం 150'' సినిమాకు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.. ఆయన బట్టలను డిజైన్ చేస్తుండగా.. ఈ మధ్యన మెగా ఫ్యామిలీలో చాలామందికి పర్సనల్ డిజైనర్ గా పనిచేస్తున్న ఇంద్రాక్షి అనే మరో డిజైనర్ హీరోయిన్లకు ఇతర మెయిన్ క్యారక్టర్లకు డిజైన్ చేస్తోందట. అయితే ఇంద్రాక్షి ఇచ్చిన ఔట్ ఫిట్స్ బాలేదని కామెంట్ చేయడంతో పాటు.. సుస్మిత చెప్పినా కూడా వినకపోవడంతో..  స్వయంగా మెగా డాటర్ తో గొడవెట్టుకున్నందుకు క్యాథరీన్ కు పింక్ స్లిప్ ఇచ్చేశారని కొందరు అంటున్నారు.

సర్లేండి.. ఈ ఐటెం సాంగ్ చేసుంటే మెగాస్టార్ చిరంజీవి సరసన చేసే ఛాన్సు వచ్చినందుకు క్యాథరీన్ హ్యాపీగా ఫీలయ్యేది. ఇప్పుడు చెయ్యకపోయినా కూడా.. ఇలా కాంట్రోవర్సీతో అమ్మడు న్యూస్ మేకర్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News