మెగా ఈవెంట్‌ సక్సెస్‌ కి కోడలే కారణం

Update: 2015-08-26 15:39 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలు అద్భుతం అంటూ సెలబ్రిటీలంతా సంతృప్తిగా ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఈ సక్సెస్‌ వెనుక అసలు కారణం ఎవరో తెలుసా? .. మెగాస్టార్‌ చిరంజీవి కోడలు, చరణ్‌ భార్య ఉపాసన. కోడలి ప్లానింగ్‌ వల్లే ఈ సక్సెస్‌ దక్కింది. వేదిక చెంతకు చేరుకునే అతిధులను రిసీవ్‌ చేసుకోవడం నుంచి విందు, వినోద కార్యక్రమాల వరకూ, సెండాఫ్‌ ఇవ్వడం కూడా అన్నీ తనే దగ్గరుండి చూసుకుంది.

అంతేనా అసలు ఇలాంటి ఓ వేడుకను నిర్వహించాలని అసలు ప్లాన్‌ ఇచ్చింది కూడా ఉపాసనే. ఈ మాటను చిరంజీవి స్వయంగా చెప్పారు. మా కోడలు బంగారం. తన మంచి మనసు వల్లే ఈ రోజు ఈ గొప్ప వేడును చేయగలిగామని చిరంజీవి ఎంతో ఆనందోత్సాహంతో చెబుతున్నారు.

చరణ్‌ విజయాల వెనక ఉపాసన, చరణ్‌ వ్యాపారాల అభివృద్ధి వెనక ఉపాసన, ట్రూజెట్‌ వెనక ఉపాసన, ఇంట్లో ఫ్యామిలీ వేడుకల్లోనూ ఉపాసన.. ఆ రకంగా కొణిదెల వారి ఇల్లు ఉపాసన రాకతో పూర్తిగా మారిపోయింది. ఏది చేపట్టినా బంగారంగా మార్చేసే కోడలు దక్కినందుకు చిరు ధన్యజీవి.
Tags:    

Similar News