చిరంజీవి లండన్‌ వెళ్లింది అందుకా..

Update: 2015-05-25 13:30 GMT
కొత్త సినిమా షూటింగ్‌ మొదలవడానికి ముందు మన హీరోలు విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఏవైనా మార్షల్‌ ఆర్ట్స్‌ లాంటివి ట్రై చేయడానికి.. లుక్‌ మార్చుకోవడానికి.. కొత్త విద్యలేవైనా నేర్చుకోవడానికి ఇలా టూర్లు వేస్తుంటారు. మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ సినిమాను అనౌన్స్‌ చేసిన వెంటనే లండన్‌కు బయల్దేరే సరికి.. మెగాస్టార్‌ కూడా ఏదో కొత్తగా ట్రై చేయబోతున్నాడని అనుకున్నారంతా. ఐతే ఆయన వెళ్లింది తన సినిమా పని మీద కాదు. లండన్‌లో చదువుకుంటున్న తన చిన్న కూతురు శ్రీజను చూసి రావడానికి.

చిరు అభీష్టానికి వ్యతిరేకంగా శిరీష్‌ అనే కుర్రాడిని పెళ్లాడి.. ఆ తర్వాత అతణ్నుంచి విడిపోయి చిరు కుటుంబంలోకి వచ్చిన శ్రీజ.. కొన్నేళ్ల కిందట ఫారిన్‌కు వెళ్లిపోయింది. లండన్‌లోని కాన్వెంట్రీ యూనివర్శిటీలో ఆ అమ్మాయి మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది. ఇటీవలే యూనివర్శిటీలో శ్రీజ బ్యాచ్‌కు కాన్వొకేషన్‌ కార్యక్రమం చేశారు. దీని కోసమే చిరు సతీ సమేతంగా లండన్‌ వెళ్లారు. శ్రీజతో కలిసి చిరు, సురేఖ ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. అదీ సంగతి!

Tags:    

Similar News