సుస్మిత వలనే చిరంజీవి షో డిలే??

Update: 2017-01-19 10:11 GMT
ఇప్పుడు ఖైదీ నెం 150 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి.. ఇక అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి వేసే తదుపరి స్టెప్ వైపే ఎక్కువగా చూస్తుంటారు. ఆయన తన తరువాత సినిమాను అప్పుడే మొదలెట్టరు కాని.. ఇప్పుడు తొలిసారి బుల్లితెరపై చిరంజీవి ఎంట్రీ ఇవ్వనున్నారు కాబట్టి.. అందరి చూపూ అటువైపే ఉంది.

ప్రస్తుతం కొన్ని ఎపిసోడ్స్ వరకే షూట్ చేసుకున్న ప్రోగా్రం ''మీలో ఎవరి కోటీశ్వరుడు'' నిజానికి గత డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేయాలి. కాని అప్పట్లో ఈ షో ను చిరంజీవి 150వ సినిమా రిలీజ్ అవ్వకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే.. ఆ షో లో ఆయన హోస్టింగ్ ఏమాత్రం తేడా వచ్చినా కూడా సినిమా రిజల్టుపై ప్రభావం పడే ఛాన్సుంటుందని.. సదరు రిలే ఆపేశారనే టాక్ ఉంది. ఇకపోతే ఇప్పుడు పెండింగ్ ఎపిసోడ్స్ తాలూకు షూటింగ్ జరుగుతోందట. కాకపోతే ఈ కార్యక్రమంలో చిరంజీవి వేసుకునే సూట్స్ అన్నీ కూడా చెన్నయ్ నుండి ఆయన కూతురు.. డిజైనర్.. సుస్మిత కొణిదెల పంపిస్తోంది. అందువలన ఆ సూట్లు రావడం లేటైతే ఇక్కడ షూటింగ్ కూడా లేటవుతోందని టాక్.

ఏదేమైనా కూడా త్వరలోనే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ టివిల్లో వచ్చేయనుందట. ఇప్పటికే సంక్రాంతికి ఒకసారి ఆ తరువాత ఒకసారి వచ్చేస్తుందని కొన్ని డేట్లతో ఊరించినా కూడా.. ఇంకా లేటైపోయింది. ఈసారైనా టైముకు వచ్చేస్తుందని అనుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News