త్రివిక్రమ్ అల్లుల మధ్య సంథింగ్ సంథింగ్

Update: 2019-03-19 05:49 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూసే కొద్దీ అంతకంతా ఆలస్యం పెరుగుతోంది కానీ దగ్గరలో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు అంతర్గతంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. మీడియాకు కానీ ఫాన్స్ కు కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేకపోయారు. స్క్రిప్ట్ ని లాక్ చేయడంలో జరుగుతున్న జాప్యం వల్లే ఇదంతా అనే కారణం బయటికి కనిపిస్తున్నప్పటికీ అరవింద సమేత వీర రాఘవను అంత తక్కువ టైంలో ఫినిష్ చేసిన త్రివిక్రమ్ దీనికి మాత్రం ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడు అనే అనుమానాలు ఉన్నాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు అల్లు అరవింద్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే వరకు ఇది సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదట. ఇప్పటికే ఈ తతంగం దాదాపు పూర్తయ్యిందని నాన్న నేను అనే టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ గత చిత్రాల తరహాలోనే ఇది కూడా హాలీవుడ్ మూవీ ది ఇన్వెన్షన్ అఫ్ లయింగ్ ఆధారంగా రూపొందుతోంది అనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ఇది నిజమా కదా అనే నిర్ధారణ లేదు.

అరవింద సమేత వీర రాఘవకు వసూళ్లు వచ్చినప్పటికీ అది త్రివిక్రమ్ రేంజ్ మూవీ కాదని అభిమానులే అంటుంటారు. కొన్ని సన్నివేశాలు ఏదో మొక్కుబడిగా చుట్టేసినట్టు అనిపించిందని వచ్చిన కామెంట్స్ దానికి బలం చేకూర్చాయి. అందుకే బన్నీ సినిమాకు అలాంటిది ఏమి రాకుండా అల్లు కాంపౌండ్ చాలా కేర్ తీసుకుంటోందట. నా పేరు సూర్య తర్వాత ఎలాగూ ఏడాది గ్యాప్ వచ్చేసింది. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టే తీరాలి కాబట్టి ఇంత శ్రద్ధ వహిస్తున్నారనే మాటలో నిజం ఉండొచ్చు
    

Tags:    

Similar News