వాల్మీకి నుంచి దేవీ తప్పుకోవడం వెనక కథ అదట!

Update: 2019-05-20 17:30 GMT
మెగా హీరో వరుణ్ తేజ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'వాల్మీకి'.  ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు.  మొదట ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.  కానీ ఈమధ్య ఈ సినిమానుండి దేవీ తప్పుకోగా ఆయన స్థానంలోమిక్కీ జే మేయర్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే దేవీ ఎందుకు తప్పుకున్నాడనే విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ అసలేం జరిగిందనేది అటు హరీష్ శంకర్ కానీ ఇటు దేవీ శ్రీ ప్రసాద్ కానీ వెల్లడించలేదు.

హరీష్ శంకర్ దేవీ కాంబినేషన్ లో మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్న విషయం తెలిసిందే.  అటు 'గబ్బర్ సింగ్' కానీ ఇటు 'డీజే'లో కానీ పాటలన్నీ చార్ట్ బస్టర్లే.  అలాంటి జోడీ మధ్యలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  తాజా సమాచారం ప్రకారం ఇద్దరి మధ్యలో ఒక విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందట. దర్శకుడు హరీష్ ఈ సినిమా కోసం ఒక రీమిక్స్ సాంగ్ ప్లాన్ చేశాడట.  అయితే రీమిక్స్ పాటలను చేయనని దేవీ స్పష్టం చేశాడట.  రీమిక్స్ పాటలకు సంగీతం చేయకూడదు అనే పాలసీ పెట్టుకునానని  చెప్పాడట.  అయితే హరీష్ మాత్రం ఈ సినిమాలో రీమిక్స్ ఉండాలని పట్టుబట్టడంతో చేసేది లేక దేవీ బైటకు వచ్చాడట. దీంతో దేవీ స్థానంలో మిక్కీ జే మేయర్ వచ్చాడు.

అయితే 'వాల్మీకి' సినిమా కోసం అసలు ఏ పాటను రీమిక్స్ చేయాలనిహరీష్ దేవీని కోరాడో మాత్రం ఇంకా తెలియరాలేదు. ఏదేతేనేం ఈ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల హరీష్ శంకర్ - దేవీ శ్రీ ప్రసాద్ ఈసారి కాంబో మిస్ అయింది.  మరి ఈ సినిమాకు మిక్కీ ఏ స్థాయిలో మ్యూజిక్ అందిస్తాడో వేచి చూడాలి.

    

Tags:    

Similar News