ఒకేసారి మూడు చోట్లా రావాలని...

Update: 2017-07-27 05:06 GMT
ఇప్పుడు సినిమా ప్రేక్షకులు భాష ఏదైనా పర్వాలేదు మాకు వినోదం కావాలి మంచి సినిమా చూశాం అనే భావన మిగలాలి అంటున్నారు. వాళ్ళు కూడా  అలానే ఏ భాష సినిమానైనా ఆదరిస్తున్నారు. తమిళ్ యంగ్ హీరో ధనుష్ కూడా ఇప్పుడు తెలుగు హీరోలలో ఒకడైపోయాడు. ‘రఘువరన్‌ బీటెక్‌’ ద్వారా ధనుష్‌ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది దానితో అతని ముందు సినిమాలు కూడా  ఇక్కడ డబ్బింగ్ చేసి విడుదల చేసేశారు. అయితే తమిళనాడులో  సూపర్ హిట్ కొట్టిన వి‌ఐ‌పి సీక్వెల్ గా వి‌ఐ‌పి2 నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది,  ప్రచారం కూడా మొదలుపెట్టారు కాని లాస్ట్ మినిట్ లో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.

వి‌ఐ‌పి2 సినిమా ధనుష్ పుట్టిన రోజు నాడు అంటే జూలై 28 నాడు విడుదలకావలిసి ఉంది. కానీ ఏవో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వలన వాయుదా వేయవలిసి వచ్చింది అని ముందు చెప్పారు. కానీ అవి ఏవి వాస్తవాలు కావంట. ధనుష్ సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడటంతో అలాగే బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాజోల్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడంతో ఈ సినిమాను తమిళ్ తో పాటుగా తెలుగు హిందీలో కూడా  ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాజోల్ ఈ సినిమాలో నటించడంతో తమిళనాడులో మంచి ఆసక్తి ఏర్పడింది అలాగే హింది కాజోల్ అభిమానులు కూడా ఎలా చేసిందో ఏమి చేసిందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ధనుష్ కూడ రెండు హింది సినిమాలులలో నటించడం వలన అక్కడ బాగనే ఆదరణ దక్కుతుందని.. విడుదల తేదీని మార్చారట. ఒకే సారి మూడు భాషలులలో విడుదల చేస్తే బాక్స్ ఆఫీసు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండవచ్చు అని భావించి ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.

కలైపులి థాను నిర్మాతగా  ధనుష్‌ సహ నిర్మాతగా చేస్తున్న వి‌ఐ‌పి2 సినిమాను సౌందర్య రజనీకాంత్‌ డైరక్షన్ చేసింది. ధనుష్కు జంటగా అమలాపాల్‌  నటిస్తుంది. మనోడు సింపుల్ గా రిలీజ్ ప్లాన్ చేసుకునుంటే బాగుండేది కాని.. ఇలా ఒకేసారి మూడు బాషల్లో రిలీజ్ అంటూ ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజులో కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నాడేమో అంటున్నారు ట్రేడ్ వర్గాలు.  



Tags:    

Similar News