కోన వెంకట్ ఏమయ్యాడు?

Update: 2016-01-12 22:30 GMT
ఓ ఏడాది వెనక్కి వెళ్దాం. ‘డిక్టేటర్’ సినిమా ఓకే అయిన టైం అది. ఎక్కడా శ్రీవాస్ కనిపించలేదు.. బాలయ్య కనిపించలేదు.. సీన్లో మొత్తం కోన వెంకటే కనిపించాడు. ‘డిక్టేటర్’కు పని చేస్తున్న మిగతా ముగ్గురు రచయితలతో కలిసి చాలా హంగామా చేశాడు కోన. కథా చర్చలు జరుపుతున్నపుడు.. రచయితలు నలుగురూ కలిసి టూర్లు వేస్తున్నపుడు సెల్ఫీలు దిగి వాటిని పోస్ట్ చేయడం.. స్క్రిప్టు అద్భుతంగా వస్తోందంటూ ట్వీట్లు చేయడం.. అబ్బో చాలా హడావుడే కనిపించింది. మామూలుగా కూడా తాను పని చేసిన మీడియం రేంజి సినిమాల్ని కూడా ట్విట్టర్ లో ప్రమోట్ చేయడం.. జనాలతో ఇంటరాక్ట్ అవడం కోనకు అలవాటే.

‘శంకరాభరణం’ విడుదల వరకు కూడా కోన ఇలాగే ఉండేవాడు. కానీ తన కెరీర్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా చెప్పుకున్న ‘డిక్టేటర్’ విషయంలో మాత్రం ఇప్పుడు ఒక్క ముక్కా మాట్లాడట్లేదు కోన. అసలు అతను ట్విట్టర్ లో ఉన్న సంగతే తెలియట్లేదు. ఇంకో రెండు రోజుల్లో ‘డిక్టేటర్’ విడుదలవుతున్నా.. దానికి కథ - స్క్రీన్ ప్లే అందించింది తనే అయినా చప్పుడు చేయట్లేదు కోన. ‘శంకరాభరణం’ రిజల్ట్ చూశాక కోన బాగా అప్ సెట్ అయ్యాడని.. అంతకు ముందు మాట్లాడిన అతి మాటల కారణంగా మీడియాలో అందరికీ టార్గెట్ అయిపోయాడని.. అందుకే ఇప్పుడ సైలెంటుగా తన తర్వాతి సినిమాలకు స్క్రిప్టు రాసుకుంటున్నాడని.. తన పెన్ పవర్ ఏంటో చూపించాక మళ్లీ లైమ్ లైట్లోకి రావాలని భావిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ ‘డిక్టేటర్’కు మంచి టాక్ వస్తే అప్పుడు బయటికి వచ్చి ఏదైనా మాట్లాడతాడేమో కోన.
Tags:    

Similar News