'మిర్చి' చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఆ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందేమో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం చేయగా కొరటాల శివ తన రెండవ సినిమాను మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' అంటూ చేశాడు. ఆ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదు అనే విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే ఆ ప్రాజెక్ట్ ను అటకెక్కించారు.
కథ విషయంలో రామ్ చరణ్ మరియు మెగా కాంపౌండ్ సంతృప్తి పడని కారణం గానే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది అంటూ అప్పుడు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సినిమా క్యాన్సిల్ అయినా కూడా రామ్ చరణ్ మరియు కొరటాల శివల మంది మంచి రిలేషన్ షిప్ మెయింటెన్ అయ్యింది. అందుకే ఇప్పుడు చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. భవిష్యత్తులో చరణ్ మూవీని కూడా కొరటాల శివ చేయబోతున్నాడు.
రామ్ చరణ్ తో సినిమా క్యాన్సిల్ అవ్వడం కు కారణం ఏంటీ అనే విషయమై కొరటాల శివ ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడానికి విభేదాలు ఏమీ లేవని.. స్క్రిప్ట్ పై నమ్మకం కలగక పోవడం వల్లే ఆ ప్రాజెక్ట్ ను వదిలేసినట్లుగా కొరటాల చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ అనుకున్నట్లు గా రాక పోవడంతో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ధైర్యం సరి పోలేదు. అందుకే చరణ్ కు చెప్పగా మీకు నమ్మకం కలిగినప్పుడే సినిమా చేద్దాం అన్నాడట. దాంతో చరణ్ తో మూవీ క్యాన్సిల్ అయ్యిందన్నాడు. ఎప్పటికైనా చరణ్ తో ఒక మంచి సినిమా చేస్తానంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు.