అక్కినేని కుటుంబానికి, అభిమానులకీ `మనం` ఓ తీయటి జ్జాపకంలా నిలిచిపోయింది. ఆ సినిమాని చేసినందుకు నాగార్జున చాలా సంతోషపడిపోతున్నాడు. `ప్రపంచంలో మేం మాత్రమే చేయాల్సిన సినిమా అది. మా కోసమే ఆ కథ తయారైంది` అని చెబుతుంటారు. ఒకరకంగా అది నిజం కూడా. ఒక కుటుంబంలోని మూడు తరాల నటులు కలిసి చేయడంతోనే `మనం` సినిమాకి అంత క్రేజ్ లభించింది. అలాంటి సినిమాని తాము చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్జతలు చెప్పుకొంటున్నాడు ఇప్పుడు నాగార్జున. కృతజ్జతలే కాదు... రుణం కూడా తీర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే నితిన్ నిర్మాణంలో అఖిల్ తొలి సినిమా చేస్తుండడం.
`మనం` కథని నాగార్జున దగ్గరికి తీసుకొచ్చింది నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డినే. నితిన్ తో `ఇష్క్` చేస్తున్నప్పుడు విక్రమ్ `మనం` కథని సుధాకర్ రెడ్డికి వినిపించడం, ఆయన నాగార్జున దగ్గరికి విక్రమ్ ని తీసుకెళ్లడం, నాగ్ కథని విని ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. అంత మంచి సినిమా తన దగ్గరికి రావడానికి కారణమైన నితిన్ కీ, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డికీ ఏదైనా బహుమానం ఇవ్వాలనుకొన్నాడు నాగ్. అందులో భాగంగానే తన సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ అఖిల్ తొలి సినిమాని నితిన్ చేతిలో పెట్టాడు. అలాగే `మనం` కోసం అడగ్గానే గెస్ట్ రోల్ లో నటించడానికి ఒప్పుకొన్న లావణ్య త్రిపాఠికి కూడా తన కొత్త సినిమా `సోగ్గాడే చిన్ని నాయనా`లో కథానాయికగా అవకాశమిచ్చాడు. `మనం`లాంటి గిఫ్టుని తనకీ, తన కుటుంబానికీ, అభిమానులకి ఇచ్చినందుకు ప్రతిగా నాగార్జున కూడా తిరిగి వాళ్లకు రకరకాల దారుల్లో బహుమానాలు ఇచ్చేస్తున్నాడన్నమాట. `మనం`లాంటి సినిమాని చేసినందుకే, అక్కినేని కుటుంబంతో అనుబంధం పెంచుకొన్నందుకే తనకి మళ్లీ `సోగ్గాడే చిన్ని నాయనా`లో అవకాశం దక్కిందని లావణ్య కూడా ఒప్పుకొంటోంది. ఇక మిగిలింది రాశిఖన్నానే. రాఖిఖన్నా కూడా మనంలో ఓ కీలక పాత్ర పోషించింది. ఆమె రుణంని కూడా తీర్చుకోవాలని, నాగచైతన్య తదుపరి సినిమాలో నటించే ఛాన్స్ ని ఆమెకి ఇవ్వాలని నాగ్ చెబుతున్నాడట.