మెగాస్టార్ 60వ పుట్టిన రోజు వేడుకల గురించి వారం తర్వాత కూడా చర్చ ఆగట్లేదు. ఆ ఫంక్షన్ తాలూకు విశేషాల గురించి వారం ముందు నుంచి డిస్కషన్ జరగ్గా.. వేడుక ముగిశా దానికి సంబంధించిన నెగెటివ్ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముందుగా పవన్ అభిమానులపై నాగబాబు ఆగ్రహం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆ వేడుకలో పాల్గొనని ప్రముఖుల గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కు అనదగ్గ దర్శకరత్న దాసరి నారాయణరావు గైర్హాజరీ అందరినీ ఆశ్చర్యపరిచింది. చిరు పర్సనల్ గా పిలవకపోవడమే పెద్దాయన రాకపోవడానికి కారణమన్న ఊహాగానాలు వినిపించాయి. అందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.
దాసరి కథ పక్కనబెట్టేస్తే సూపర్ స్టార్ మహేష్ ఈ వేడుకలో కనిపించకపోవడం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. చిరు సమకాలీనులు నాగార్జున, బాలకృష్ణలతో పాటు ఆ తర్వాతి తరం హీరోలందరూ కూడా ఈ వేడుకలో కనిపించారు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు. కానీ మహేష్ రాలేదు. చాలామంది మహేష్ హైదరాబాద్ లో లేడని.. థాయిలాండ్ కు వెళ్లిపోయాడని.. అందుకే ఈ వేడుకలో పాల్గొనలేదని అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. చిరు బర్త్ డే వేడుక జరిగినపుడు మహేష్ భాగ్యనగరంలోనే ఉన్నాడు. తర్వాతి రోజు ఓ ఛారిటీ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. శనివారమే అతను కుటుంబంతో కలిసి థాయిలాండ్ కు బయల్దేరి వెళ్లాడు. ఐతే మహేష్ రాకపోవడానికి కూడా పర్సనల్ పిలుపు అందకపోవడమే కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్ ఆఫీస్ లో ఇన్విటేషన్ ఇచ్చి వెళ్లారు తప్పితే.. చిరు కుటుంబ సభ్యులెవరూ పర్సనల్ గా కాల్ చేయడం కానీ, కలిసి పిలవడం కానీ చేయలేదని.. అందుకే మహేష్ రాలేదని అంటున్నారు. ఇంకొందరేమో మహేష్ మామూలుగానే వేరే వాళ్ల ఫంక్షన్లకు రావడం తక్కువ కాబట్టే ఆ వేడుకకు దూరంగా ఉన్నాడని అంటున్నారు. ఇందులో ఏది వాస్తవమో మహేష్ నెక్స్ట్ టైం మీడియా వాళ్లను మీట్ అయినప్పుడు అడిగితే తెలుస్తుంది.