ద‌ర్శ‌కేంద్రుడి వార‌సుడికి ఏమిటీ క‌ష్టం?

Update: 2019-06-20 09:47 GMT
ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు వార‌సుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి ప్ర‌యోగాల మైండ్ సెట్ గురించి తెలిసిందే. ఇదివ‌ర‌కూ అన‌గ‌న‌గా ఒక ధీరుడు.. సైజ్ జీరో లాంటి ప్ర‌యోగాలు చేశారాయ‌న‌. ఆ ప్ర‌య‌త్నాలు బాక్సాఫీస్ వద్ద విఫ‌ల‌మయ్యాయి. అయినా త‌న పంథాని మాత్రం అస్స‌లు వీడ‌లేదు. ఈసారి బాలీవుడ్ లో అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంగ‌న ర‌నౌత్ - రాజ్ కుమార్ రావ్ జంట‌గా `మెంట‌ల్ హై క్యా` అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని ప్ర‌కాష్ కోవెల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా పోస్ట‌ర్లు స‌హా ప్ర‌తిదీ ఆస‌క్తి పెంచాయి. మ‌నిషిలో మెంట‌ర్ డిజార్డర్స్ నేప‌థ్యంలో ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టును ఎంచుకుని ప్ర‌కాష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ నుంచి సినిమాపై హైప్ క్రియేట్ చేయ‌డంలోనూ పెద్ద స‌క్సెస‌య్యారు. మెంట‌ల్ అన్న టైటిల్ కి త‌గ్గ‌ట్టే పోస్ట‌ర్లు మెంటలెక్కించాయి. కంగ‌న‌.. రాజ్ కుమార్ రావు నాలుక అంచున బ్లేడ్ ని నిల‌బెట్టే ప్ర‌యత్నం చేయ‌డం... పుస్త‌కాలు త‌గ‌లేసి దానిపై చేప‌ను కాల్చుకు తిన‌డం లాంటి మెంట‌ల్ వేషాల్ని పోస్ట‌ర్ల‌లో చూపించారు. పోస్ట‌ర్ల‌లోనే మెంట‌ల్ ని పీక్స్ లో చూపించ‌డంలో స‌క్సెస‌య్యారు. ఆ క్ర‌మంలోనే థియేట‌ర్ల‌లోనూ ప్రేక్ష‌కుల‌కు మెంట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారంతా. ప్ర‌స్తుతం ఈ సినిమా ట్రైల‌ర్ ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే ట్రైల‌ర్ రిలీజ్ ముందు `మ‌నోభావాలు` పేరుతో వివాదం రాజుకుంది. మెంట‌ల్ డిజార్డ‌ర్స్ పేరుతో అమాన‌వీయ‌త‌ను తెర‌పై చూపిస్తారా? అంటూ కోర్టులో కేసు వేసి పిటీష‌న‌ర్లు వాదిస్తున్నారు. మాన‌సిక రుగ్మ‌త‌లు ఉన్న పేషెంట్ మ‌నోభావాల్ని దెబ్బ తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటూ అభ్యంత‌రం వ్య‌క్తమైంది. రిలీజ్ కి ముందు ట్రైల‌ర్ ప్రివ్యూని చూపించాల్సిందిగా సైక్రియాటిస్టు సంఘం(ఐపీఎస్) గుజ‌రాత్ హైకోర్టులో పిటీష‌న్ వేసింది. సీబీఎఫ్‌ సీ- ఇండియ‌న్ సైక్రియాట్రిక్ సొసైటీ(ఐపీఎస్) స‌మ‌క్షంలో ట్రైల‌ర్ ని రివ్యూ కోసం వేయాల్సిందిగా చిత్ర‌యూనిట్ ని కోరారు. మొత్తానికి ఈ వివాదాల‌తో మెంట‌ల్ హై క్యాకి రావాల్సినంత ప్ర‌చారం వ‌చ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఏక్తాక‌పూర్ నిర్మిస్తున్నారు కాబ‌ట్టి ఆల్ట్ బాలాజీ బ్యాన‌ర్ త‌న‌దైన శైలిలో ప్ర‌చారానికి ప్ర‌తి పాయింట్ ని వాడేస్తోంది.

జూన్ 11న సీబీఎఫ్‌ సీ ప్యానెల్ కి ట్రైల‌ర్ ని స‌బ్ మిట్ చేశారు. ఆ క్ర‌మంలోనే సీబీఎఫ్‌ సీ ట్రైల‌ర్ రివ్యూకి ఐపీఎస్ బృందం సిద్ధ‌మైంది. పిటీష‌న‌ర్ స‌మక్షంలో రివ్యూ చేయ‌నున్నార‌ని సెన్సార్ బోర్డ్ త‌ర‌పున న్యాయ‌వాది క్షితిజ్ అమిన్ తెలిపారు. ట్రైల‌ర్ రివ్యూ చేసి త‌దుప‌రి యాక్ష‌న్ తీసుకుంటార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే దీనిపై తుది విచార‌ణ వ‌చ్చే వారం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి జూన్ 26న ఈ సినిమా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించారు. తాజా వివాదం నేప‌థ్యంలో సినిమా రిలీజ‌వుతుందా లేదా? అన్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. మ‌రోవైపు అస‌లు తాము ఎవ‌రి మ‌నోభావాల్ని దెబ్బ తీయ‌ద‌లుచుకులేద‌ని.. మాన‌సిక వైక‌ల్యాన్ని కించ‌ప‌ర‌చ‌డం లేద‌ని ఆల్ట్ బాలాజీ బృందాలు చెబుతున్నాయి. ఇంత‌కీ ఈ త‌ల‌నొప్పుల‌న్నిటినీ ప‌రిష్క‌రించుకోవ‌డంలో ప్ర‌కాష్ కోవెల‌మూడి ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం.


Tags:    

Similar News