సౌత్ ఇండియాలో ఫిలిం ఫేర్ అవార్డులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ అవార్డు దక్కించుకోవడం ఓ అఛీవ్ మెంట్ గానే నటీనటులు భావిస్తారు. ప్రతిసారి గ్రాండ్ గా నిర్వహించే అవార్డు ఫంక్షన్ కు దక్షిణాదిలోని నాలుగు భాషల్లోని నటీనటులు మాగ్జిమం ముందుకొస్తారు. కానీ ఈసారి తమిళం నుంచి ఉత్తమ హీరోయిన్ అవార్డు దక్కించుకున్న నయనతార ఈ ఫంక్షన్ కు రాకుండా హ్యాండిచ్చింది.
నయనతార తమిళంతోపాటు తెలుగులోనూ ఫేమస్ హీరోయిన్ కాబట్టి ఆమె రాకపోవడంపై ఇక్కడి అభిమానులు ఆరా తీశారు. ఆమె రాకపోవడానికి కోలీవుడ్ యాక్టర్స్ యూనియన్ నడిగర్ సంఘమే కారణమని తెలిసింది. సినిమావాళ్లతో అవార్డు ఫంక్షన్లు.. ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రాంలు లాంటివి నిర్వహించాలంటే తమకు కొంత విరాళం ఇచ్చి తీరాలని నడిగర్ సంఘం ఈమధ్య రూల్ పెట్టింది. తమిళనాడులోని ఛానళ్లు అన్నీ ఆ సంఘానికి ఎంతో కొంత ఇచ్చి ప్రోగ్రాంలు చేసుకుంటున్నాయి.
కానీ ఫిలిం ఫేర్ మాత్రం ఈ రూల్ ను ఏ మాత్రం లెక్క చేయలేదు. దాంతో నడిగర్ సంఘం నుంచి ఫ్యూచర్ లో హెల్ప్ ఆశించేవాళ్లు ఆ ఫంక్షన్ కు వెళ్లొద్దంటూ సంఘం రూల్ పాస్ చేసింది. సంఘంతో గొడవ ఎందుకనుకుందో ఏమో నయనతార ఫిలిం ఫేర్ ఫంక్షన్ కు రాలేదు. ఆమే కాదు.. ఖుష్బూ.. విజయ్ సేతుపతి.. కార్తి కూడా ఇదే రీజన్ తో ఫిలిం ఫేర్ ఫంక్షన్ అటెండవలేదు.