ఇండియా టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్ అంటూ తాజాగా ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితాను ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ నుంచి నలుగురు హీరోలు మహేష్ బాబు.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్ లకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. అయితే.. టాలీవుడ్ పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ పేరు ఈ లిస్ట్ లో కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పత్రికల్లో వచ్చే కథనాలు.. ఇంటర్నెట్ సెర్చ్ లు.. వెబ్ సైట్స్ లో పాపులారటి.. చివరగా సంపాదన.. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఫోర్బ్స్ జాబితా సిద్ధం చేస్తారు. ఏ యాంగిల్ లో చూసినా పవన్ పేరు కూడా కచ్చితంగా ఈ లిస్ట్ లో ఉండాల్సిందే. అలాంటిది పవర్ స్టార్ పేరు సెలబ్రిటీల లిస్ట్ లో చేర్చకపోవడాన్ని పవన్ అభిమానులు తప్పు పడుతున్నారు. ఒక ప్రక్కన టాలీవుడ్ నుండి అల్లు అర్జున్.. మహేష్ బాబు.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ వంటి నటులు ఫేం ర్యాంకింగ్ లో తమ సత్తా చాటినప్పుడు.. పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం ఏంటి? ఎక్కడో ఫోర్బ్స్ లిస్ట్ లో ఏదో తేడా జరిగింద అనే సందేహం వస్తోంది కదూ. కాకపోతే ఫోర్బ్స్ పత్రిక విలువలకూ ప్రమాణాలకు పెట్టింది పేరు. వారు ఎలా పవన్ పేరును మిస్సవుతారూ?
అయితే ఫైనల్ లిస్ట్ ప్రిపరేషన్ లో ఓ ఫార్మాలిటీ ఉంటుంది. ఫోర్బ్స్ ఎంపిక చేసిన సెలబ్రిటీలకు ఫోర్బ్స్ నుంచి ఓ లెటర్ అందుతుంది. తాము సేకరించిన వివరాల ప్రకారం.. వారి పేర్లను లిస్ట్ లో ఉంచుతామని ఆ లేఖలో ఉంటుంది. దానికి అభ్యంతరం లేదంటూ తన పేరు ఉపయోగించుకోవచ్చని నో అబ్జెక్షన్ లెటర్ పంపితేనే.. జాబితాలో పేరు ఉంటుంది. లేకపోతే వారి పేరును ఆ స్థానం నుంచి తొలగించి తర్వాత ఉన్నవారిని ముందుకు జరుపుతారు. పవన్ విషయంలో అదే జరిగి ఉంటుందని.. ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్ ఓసీ ఇచ్చి ఉండడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇలా సెలబ్రిటీ లిస్ట్ ప్రిపరేషన్ లో రాజకీయ నాయకులను కూడా పరిగణించబోరు. పవన్ రాజకీయాల్లో ఉన్నా పదవుల్లో లేకపోవడం కూడా లిస్ట్ లో పేరు లేకపోవడానికి కారణం అంటున్నారు. మినిష్టర్ లేదా అంతకంటే ఎక్కువైనా పదవిలో ఉంటే మాత్రం పేరును లెక్కలోకి తీసుకుంటారు. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కూడా ఫోర్బ్స్ జాబితాలో కనిపించలేదు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వాక్స్ స్టాట్యూను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన బాహుబలి ప్రభాస్ ను టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్ లో చేర్చకపోవడం కూడా.. ఫోర్బ్స్ నిర్ణయించుకున్న ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/