ప‌వ‌న్ స్పీడ్ కు అస‌లు కార‌ణం అదే

Update: 2020-02-11 12:30 GMT
న‌సేన అధిత‌నే..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పింక్ రీమేక్ తో(లాయ‌ర్ సాబ్) రీ ఎంట్రీ  ఇవ్వ‌డం..అటుపై వ‌రుస‌గా సినిమాలు ప్ర‌క‌టించ‌డంతో అభిమానులు సైతం షాక్ అయ్యారు.  వేణు  శ్రీరామ్  ద‌ర్శ‌క‌త్వంలో పింక్ రీమేక్ లో నటిస్తూనే క్రిష్ తో త‌న 27వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అటుపై హ‌రీష్ శంక‌ర్ తో 28వ చిత్రాన్ని.. యంగ్ డైరెక్ట‌ర్ బాబికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డం కోసం త‌న‌తో 29వ చిత్రాన్ని...డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో త‌న 30 వ చిత్రాన్ని చేస్తున్న‌ట్లు క‌థ‌నాలు ఇప్ప‌టికే వేడెక్కిస్తున్నాయి.  నిజంగా ఇది అభిమానుల‌కు ఊహించ‌ని స‌ర్ స‌ర్ ప్రైజ్.  ఏడాదికి ఒక సినిమా చేసి మిగ‌తా స‌మయాన్ని రాజ‌కీయాల‌కు కేటాయిస్తాడ‌ని అభిమానులు స‌హా ప్రేక్ష‌కులు భావించారు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప‌వ‌ర్ స్టార్  స‌రికొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్నాడు.

సినిమాలకంటూ ఎక్కువ స‌మ‌యాన్ని..రాజ‌కీయాల‌కంటూ కొంత స‌మాయాన్ని కేటాయించి ప్లాన్ చేసుకుని కొత్త‌ ప్ర‌యాణం సాగిస్తున్నాడు. తొలిగా క‌మిట్ అయిన మూడు సినిమాల‌కు ప‌వ‌న్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు ప్ర‌చారం సాగుతోంది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాలు యాక్టివ్ గా సాగ‌లంటే డ‌బ్బు అవ‌స‌రం కాబ‌ట్టి సినిమాలు చేయాల్సి వ‌స్తుంద‌ని కొంద‌రంటుంటే?  పూర్తిగా  మేక‌ప్ వేసుకుని సీన్ లోకి ఎంట‌రైపోయాడ‌ని మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. ఆ కార‌ణాలు ఎలా ఉన్నా?  ప్ర‌స్తుత ఏపీ ముఖ్య మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న బాగుంటే...తాను ప్ర‌శాంతంగా సినిమాలు చేసుకుంటాన‌ని..త‌నికి రాజకీయాలు చేయాల్సిన  అవ‌సరం లేద‌ని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

 ముఖ్యంగా జ‌గ‌న్ పాల‌న బాగుంటే మ‌ళ్లీ  సినిమాల‌కే అంకిత‌మైపోతాన‌ని ఒక‌టికి రెండుసార్లు ప్ర‌స్తావించాడు. మ‌రి ప‌వ‌న్ తాజా స‌న్నివేశాన్ని చూస్తుంటే మాట మీద నిల‌బ‌డుతున్న‌ట్లున్నాడ‌ని  కామెంట్లు ప‌డుతున్నాయి. అమ‌రావ‌తి  రాజ‌ధాని రైతుల విష‌యంలో ఒక్క‌సారిగా  సైలెంట్ అయిపోయాడు. విజ‌య‌వాడ లో భాజాపాతో క‌లిసి లాంగ్ మార్చి అని ప్ర‌క‌టించి వెన‌క్కి త‌గ్గాడు. రాజ‌ధానిపై నో నాయిస్....ఓన్లీ  సీయింగ్  అన్న‌ట్లే కనిపిస్తున్నాడు. వీట‌న్నింటిని ప‌క్క‌న‌బెడితే  ఏపీలో  జ‌గ‌న్ పాల‌న‌ను ప్ర‌జ‌లు మెచ్చారు కాబ‌ట్టే ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అవుతున్నాడ‌ని..అందుకే వ‌రుస పెట్టి సినిమాలు ప్రక‌టిస్తున్నాడ‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా  ఈ విష‌యం ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు...రాయ‌ల‌సీ మ ప్ర‌జ‌ల మ‌ధ్య గ‌త వారం రోజులుగా హాట్ టాపిక్ అయింది. మ‌రి ప‌వ‌న్ పొలిటిక‌ల్ స్పీడ్ కి బ్రేకు వేసింది జ‌గ‌న్ ఉత్త‌మ పాల‌నే అనుకోవాలేమో.
Tags:    

Similar News