బాహుబలి ప్రాజెక్ట్ విషయంలో అందరూ కష్టపడ్డారు. కానీ అందరికంటే ఎక్కువ తపన పడింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రాజమౌళి విజన్.. ఓ మహోన్నత సామ్రాజ్యం అయిన మాహిష్మతిని.. ఆ రాజ్యానికి సంబంధించిన కథ ద్వారా బాహుబలి సిరీస్ ను అందించేందుకు కారణమైంది.
ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ముఖ్యంగా టీం విషయంలో అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులతోనే పని చేయించుకున్నాడు. అయితే.. బాహుబలి పార్ట్ 1 కు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్.. రెండో భాగానికి వర్క్ చేయలేదు. ఈసారి అమెరికన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ను తీసుకొచ్చాడు జక్కన్న. ఇందుకు కారణం.. కొన్ని అంశాల్లో వీరిద్దరికీ పొంతన కుదరలేదట. సినిమాల విషయంలో ఇలాంటి విబేధాలు రావడం సహజమే. అలాగే.. వీరిద్దరికీ కూడా క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో వాదనలు తప్ప.. వ్యక్తిగతంగా ఎలాంటి వైషమ్యాలు లేవని అంటున్నారు.
ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ సాధించిన ఘనవిజయం ముందు.. ఇలాంటివేమీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ సినిమా కలెక్షన్స్ చూసి నోళ్లు తెరవడం తప్ప.. వెనక ఏం జరిగిందో అసలేమాత్రం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/