ముందు ఐటమ్ గాళ్ తరువాత హీరోయిన్

Update: 2017-10-06 09:40 GMT
స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసేందుకు నేటి తరం క్రేజీ హీరోయిన్లు పక్కా మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. స్టార్ హీరోలను మెప్పించేకంటే ముందు వారి అభిమానుల్ని మెప్పించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లుగా మారిపోతున్నారు. నిజానికి అవకాశాలు తక్కువైన స్టార్ హీరోయిన్ సడెన్ గా ఐటమ్ భామగా మారి మళ్లీ తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది నేటి తరం హీరోయిన్స్ బ్యాచ్ లో తమన్నా విషయంలో రుజువు అయింది. కెరీర్ డల్ అయిన టైమ్ లో తమన్నా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఐటమ్ పాటకు చిందేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. అంతేకాదు అటు ఐటమ్ భామగా ఇటు హీరోయిన్ గా కూడా రాణిస్తోంది.

దీంతో తమన్నా ఎంచుకున్న ఈ దారినే మిగతా భామలు కూడా ఫాలో అవుతున్నారు. తమన్నాకు పోటీగా ఇటీవలే కాజల్ కూడా ఐటమ్ భామగా మారింది, యన్టీఆర్ నటించన జనతా గ్యారేజ్ సినిమాలో నేను పక్కా లోకల్ అంటూ రచ్చరచ్చ చేసింది. ఈ పాట హిట్ అవ్వడంతో కాజల్ కు మళ్లీ అవకాశాల వెల్లువ ఎక్కువైందట. ప్రస్తుతం తెలుగు - తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. జనతా గ్యారేజ్ లో చిందేయడానికి కాజల్ పుచ్చుకున్న పారితోషికం అరవై లక్షలు. ఇక ఇటీవలే ఈ జాబితాలో మాజీ మిస్ ఇండియా పూజా హెగ్ధే కూడా చేరింది. దువ్వాడ జగన్నాథం సినిమాతో తెలుగునాట ఈ భామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తాజాగా రామ్ చరణ్ రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం పూజాకు దక్కిందని సమాచారం. అయితే మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ రంగస్థలం లో ఆడిపాడేందుకు కేవలం 30 లక్షలే పుచ్చుకోవడం అందరీకి ఆశ్చర్యం కలిగించినా అసలు కిటుకు వేరే ఉందని అంటున్నారు. రామ్ చరణ్ - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో పూజాహెగ్థేకి హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామంటూ కమిట్ మెంట్ ఇవ్వడంతో ఈ భామ ఇప్పుడు రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని అంటున్నారు. మరి ఐటమ్ భామలుగా కాజల్ - తమన్నాలకు నూటికి నూరు శాతం మార్కులు వేసిన అభిమానులు ఇప్పుడు పూజాహెగ్థేను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News