పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పీవీపీల మధ్య అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవన్ ఓ రాజకీయ పార్టీ ఆలోచన చేసినపుడు.. దానికి సొంత ఖర్చుతో పీవీపీ నే పురుడు పోశాడని అంటారు. అందుకు ప్రతిగానే విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించేందుకు పవన్ ప్రయత్నించాడనే టాక్ ఉన్నా.. ఆ పని మాత్రం జరగలేదు. ఇప్పుడు పవన్ చెప్పిందొకటి, చేసిందొకటి అంటూ పీవీపీ కామెంట్ చేయడం హాట్ న్యూస్ అయిపోయింది.
'చేగువేరాపై మా ఇద్దరికి ఉన్న కామన్ అభిప్రాయం మమ్మల్ని దగ్గర చేసింది. కానీ పవన్ చెప్పినది వేరు, జరిగినది వేరు. నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. కానీ అది మాకెవరికీ తెలీకుండానే రాజకీయ పార్టీగా మారిపోయింది' అని చెప్పిన పీవీపీ.. తాను గతంలో పవన్ కి మద్దతు ఇచ్చానని, మాటసాయం చేశానని, చేతల్లో కూడా సాయం అందించానని.. తనకు చేతైననంతగా చేశానని చెప్పాడు.
ఇప్పుడు పవన్ తో సంబంధాల విషయంలో నోరు మెదపని ఈ బడా నిర్మాత.. భవిష్యత్తులో తామిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం లేదని తేల్చేశాడు. తనకు నచ్చిన పనే చేస్తానని, నచ్చని పని అసలు చేయబోనని.. అందులో పవన్ తో సినిమా చేయడం కూడా ఒకటని చెప్పడం ఆలోచించాల్సిన విషయమే.