మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు చేసినన్ని కసరత్తులు ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి కూడా చేసి ఉండడు అనడంలో అతిశయోక్తి లేదనుకుంటా. ఎన్నో ఆలోచనలు - ఆరాలు - అభిప్రాయాల నడుమ ఎట్టకేలకు చిరు 150 వ సినిమా ఓకే అయింది. వి.వి వినాయక్ దర్శకత్వలో తమిళ కత్తి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. చిరు ఇప్పటి వరకు నటించిన 149 చిత్రాల్లో ఏవో కొన్ని చిత్రాలు మినహా దాదాపుగా అన్ని చిత్రాలకు కథలు మన తెలుగు వారే అందించారు. అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు మాత్రం కథ ఇవ్వలేకపోయారు అన్నది తెలుగు సినీ ప్రేమికుల ఉవాచ. నిజంగా తెలుగు రచయితలు - దర్శకులు కథ సిద్ధం లేకపోయారా? లేక చిరంజీవి వారి నుండి కథ తీసుకోలేకపోయాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలా ఉంటే...
ఇప్పటికే చిరు సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వరుస ఫ్లాప్ లతో విసిగి పోయిన చరణ్ తని ఒరువన్ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా తండ్రీ కొడుకులు తమిళ చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడం, ఇప్పడు తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యామిలీకి కథలు చేసేవారు తెలుగు పరశ్రమలోనే లేరా అంటూ చిరు అంటే పడని వారు కామెంట్స్ మీద కామెంట్స్ గుప్పిస్తున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. కానీ షూటింగ్ ప్రారంభం కావడానకి సమయం పడుతుందట. దీనికి కారణం మరెవరో కాదు చిరంజీవేనట. చిరు 150వ చిత్రాన్ని సొంత బేనర్ లో చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల తండ్రి సినిమా పట్టాలెక్కకుండా తన సినిమాలో బిజీ కావడం సుతారమూ చరణ్ కి ఇష్టం లేదంట. కాబట్టి చిరు సినిమా షూటింగ్ ప్రారంభించి ఆ పైన రామ్ చరణ్ తన సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడని తెలుస్తోంది. చిరు 150 చిత్రాన్ని చాలా గ్రాండ్ గా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.