ర‌మ రాజ‌మౌళి ఎలా స్టైలిస్ట్ అయింది?

Update: 2017-04-23 16:47 GMT
రాజ‌మౌళి భార్య‌గా కంటే రాజ‌మౌళి సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఎక్కువ గుర్తింపు సంపాదించింది ర‌మ‌. ఏదో రాజ‌మౌళి భార్య కాబ‌ట్టి అవ‌కాశం ద‌క్కుతోంద‌ని అనుకుంటే పొర‌బాటే. రాజ‌మౌళి సినిమాల్లో కాస్ట్యూమ్స్ ఎంత ప్ర‌త్యేకంగా ఉంటాయో.. దీనికి సంబంధించి ఎంత ప‌ని ఉంటుందో ఆ సినిమాలు చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌రి ర‌మ అస‌లీ రంగంలోకి ఎలా వ‌చ్చింది.. ఎలా ప్రావీణ్యం సంపాదించింది.. ఎలా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది.. ఆ విశేషాలేంటో ర‌మ మాట‌ల్లోనే తెలుసుకుందాం ప‌దండి.

‘‘మొదట్నుంచీ నేను కెరీర్లో ఏదో అయిపోవాల‌ని అనుకోలేదు. మా అమ్మ చదువుకోమన్నా పెద్ద పట్టించుకోలేదు. రాజ‌మౌళితో పెళ్ల‌యిన‌ తర్వాత కూడా సినిమాల్లో ప‌ని చేయాలని కానీ.. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవ్వాలని కానీ ఆలోచన లేదు. ఐతే రాజమౌళికి క్యారియర్‌ తీసుకుని షూటింగ్ జ‌రిగే ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌పుడు ఈ రంగంపై ఆస‌క్తి పెరిగింది. ‘సింహాద్రి’ షూటింగ్ జరుగుతుండ‌గా.. కాస్ట్యూమ్స్ లో కొన్ని రాజమౌళికి నచ్చ‌లేదు. మార్చి చేయించుకుందామంటే అసలు స‌మ‌స్య‌ ఏంటో చెప్పడం తనకు తెలిసేది కాదు. అప్పుడు నేను కలర్‌ కాంబినేషన్‌ విషయంలో సలహాలిచ్చేదాన్ని. అలా నాకు తెలియకుండానే ఈ విభాగంలో ఇన్వాల్వ్‌ అయ్యాను. పాట‌లు తీసేటప్పుడు.. కొంచెం కాస్ట్యూమర్ తో మాట్లాడవా అని రాజ‌మౌళి అడిగేవాడు. దీంతో నేనే వెళ్లి మెటీరియల్‌ కొని.. తెచ్చేదాన్ని. అలా ‘సింహాద్రి’లోని అన్ని పాట‌ల‌కూ నేనే కాస్ట్ర్యూమ్స్ స‌మ‌కూర్చా. ‘సై’ సినిమా  నుంచి అఫిషియల్‌ అయిపోయా’’ అని ర‌మ తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News