సర్దార్.. బ్రహ్మోత్సవం.. ఈ రెండు సినిమాలు ఒక రేంజు హిట్టును కొట్టి.. అవసరమైతే బాహుబలి సక్సెస్ ను కూడా టచ్ చేస్తాయేమో అని అందరూ ఎదురు చూశారు. కాని రిజల్టు వచ్చాక భయమేసింది. మొదటి రోజునే నెగెటివ్ టాక్ వచ్చేసింది. దానితో ఈ హీరోలపై చర్చలు పీక్స్ కు వెళ్ళిపోతున్నాయ్.
కొందరేమో పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు ఫూలిష్ గా కథలు ఎంచుకున్నారు అని కామెంట్ చేస్తే.. కొందరేమో వీళ్ళు మరి ఓవర్ కాన్ఫిడెంట్ గా సినిమాచు చేస్తున్నారని విమర్శించారు. ఇక సర్దార్ ఫ్లాప్ అన్నప్పుడు మహేష్ ఫ్యాన్స్ ట్రాల్ చేస్తే.. బ్రహ్మోత్సవం డిజాష్టర్ అన్నప్పుడు పవన్ ఫ్యాన్స ట్రాలింగ్ చేశారు. యాంటీ ఫ్యాన్స్ చాలామంది ఉండొచ్చులే కాని.. అందులో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సగం మంది ఉంటారనేది ఓపెన్ సీక్రెట్. ఇక పాయింట్ ఏంటంటే.. ఈ ఫ్యాన్స్ ట్రాల్ చేసినంత మాత్రాన.. లేకపోతే ఈ యాంటీ ఫ్యాన్సు కామెంట్లు చేసినంత మాత్రాన.. లేకపోతే కేవలం ఆ హీరో ఫ్యాన్స్ మాత్రమే చూసినంత మాత్రాన సినిమాలు ఆడేయవు. మొత్తం బాహుబలి వ్యూయర్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా ఒక 10% మాత్రమే. అంటే మిగిలినవారందరూ సాధారణ మూవీ లవర్స్. సో.. వాళ్ళకు నచ్చితే నే సర్దారైనా ఆడుతుంది.. బ్రహ్మోత్సవమైనా కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. మరి వాళ్ళకు ఈ సినిమాలు ఎందుకు నచ్చేలేదు?
నిజానికి సర్దార్ సినిమా విషయం తీసుకుంటే.. పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఎనలేని ఎంటర్టయిన్మెంట్ అందించాలనే సినిమా కథను రాశాడు. కాకపోతే ఆయన ఎప్పుడో ఓ 15 ఏళ్ళ క్రిందట అనుకున్న పాయింట్ కు.. బయటవారు ఏం తీస్తున్నారు తెలుసుకోకుండా ఆయన సొంతంగా యాడ్ చేసిన మసాలా ఐటెమ్స్ సరిగ్గా నప్పలేదు. పవన్ నుండి ఏదో అవతార్ - ఇంటర్ స్టెల్లార్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఎక్సపెక్ట్ చేస్తున్న అభిమానులకు ఈ సినిమా నచ్చలేదు. ఇప్పుడు ఒక సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందంటే.. ముందురోజు బెనిఫిట్ షోలూ.. ప్రీమియర్లు.. చూసేది ఖచ్చితంగా అభిమానులే. సో వాళ్ళకే సినిమా ఎక్కలేదంటే.. మరి మామూలు ఆడియన్స్ కు ఎందుకు ఎక్కుతుంది? అందుకే 80 కోట్ల సర్దార్ కు 30 కోట్ల లాస్ తప్పలేదు.
బ్రహ్మోత్సవం విషయానికొస్తే.. మనోడు శ్రీమంతుడు సినిమాలో ఆల్రెడీ చాలా నీతులే చెప్పాడు. దానికంటే ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా చాలా నీతులు చెప్పుకొచ్చాడు. అసలు కథ అండ్ కంటెంట్.. నెరేషన్ అండ్ ఫ్లో ఎలా ఉంది అనే అంశాలకంటే.. సబ్ కాన్షియస్ లెవెల్లో ఇలా క్లాసులు మీద క్లాసులు పీకుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ ఫీలింగ్ కు తోడు నెరేషన్ లో జర్క్ ఉండటం వలన ప్రేక్షకులు డిస్కనక్ట్ అయ్యారు. ఈ సినిమాను కూడా ముందురోజు చూసే వారిలో ఆ 10% కు చెందిన 90% ఫ్యాన్సే ఉంటారు. వారే దెబ్బేశారు. వారికే నచ్చలేదు. బాలేదేహా అంటూ టాక్ చెప్పారు. అక్కడ ఉండి నెగెటివ్ టాక్ ఊపందుకుంది. ఓ 40 కోట్లు లాస్ దిశగా సినిమా పయనిస్తోంది.
కట్ చేస్తే.. ఈ సినిమాల ఫేట్ ను మనం పవన్ అండ్ మహేష్ బ్యాడ్ డెసిషన్ తీసుకున్నారనో.. లేదంటే ప్రేక్షకులు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనో కామెంట్ చేయలేం. ఎందుకు.. మొన్న అత్తారింటికి దారేది సినిమాకు పూలు ప్రశంసలు కురిపించిన వారిలో.. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందులో మహేష్ ఫ్యాన్స్ అండ్ ఆల్ ఇతర హీరోల అభిమానులు.. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళే రాళ్ళేస్తున్నారు. బ్రహ్మోత్సవం విషయంలో కూడా అంతే. అప్పుడు శ్రీమంతుడుకు పూలేసిన వారే ఇప్పుడు రాళ్ళు రువ్వుతున్నారు. ఇక అత్తారింటికి దారేది అండ్ శ్రీమంతుడు కథలను ఓకె చేసిన హీరోలే ఈ కథలను కూడా ఓకే చేశారు. హిట్టవ్వుద్దని నమ్మే తీశారు. కాని ఆడలేదు.
సో.. సినిమాల సక్సెస్ అనేది ఒక ప్రాబబిలీటీ అండ్ ప్రెడిక్టబులిటీ లేని అంశంగానే చూడాలి. వివిధ పరిస్థితుల కారణంగా సినిమాలనేవి హిట్టవుతాయి. కేవలం పైరసీ ప్రింటు లీకయ్యింది కాబట్టే.. అత్తారింటికి దారేది సినిమాకు అంత క్రేజ్ వచ్చిందని అన్నారు. అలాగే బాహుబలి హిట్టయ్యింది కాబట్టే శ్రీమంతుడు కు వెంటనే భారీగా కలక్షన్లు వచ్చాయి అన్నారు. ఎవరేమన్నా.. ఆ సినిమాల్లో కంటెంట్ ఆకట్టుకోకపోతే అలా ఆడవు. ఇప్పుడొచ్చిన సర్దార్ అండ్ బ్రహ్మోత్సవంలో కంటెంట్ ఆకట్టుకోలేదు కాబట్టే ఇవి ఆడట్లేదు. ఇక.. పూలు అండ్ రాళ్ళు.. తప్పవు బాస్!!!