రూమర్స్ కి త్రిష భలే చెక్ పెట్టిందే

Update: 2017-03-26 05:26 GMT
సుచి లీక్స్ వ్యవహారం సౌత్ సినిమాను.. ముఖ్యంగా తమిళ పరిశ్రమను కుదిపేసింది. సింగర్ సుచిత్రా కార్తీక్ సోషల్ మీడియాలో ఖాతాలో జరిగిన రచ్చ.. చాలామంది స్టార్లను సెలబ్రిటీల పరువు తీసిపారేసింది. ఫోటోలు ఉన్నా లేకున్నా.. సుచి లీక్స్ లో పేరు కనిపిస్తే మాత్రం చాలు.. అదో పరువు తక్కువ వ్యవహారం అనే రేంజ్ లో ప్రచారం జరిగిపోయింది.

ఈ వ్యవహారంలో త్రిష పేరు కూడా బాగానే నానింది. రానాతో.. ధనుష్ తో త్రిష క్లోజ్ గా ఉన్న ఫోటోలు నెట్ లో బాగానే చక్కర్లు కొట్టాయి. అప్పటి నుంచి ఈ చెన్నై చిన్నది కనీసం సోషల్ మీడియాలో కనిపించడం మానేసింది. అంతకు ముందే జల్లికట్టు దెబ్బకు నెలన్నరపాటు దూరంగా ఉన్న ఈ భామకు.. సుచి లీక్స్ మరోసారి దెబ్బ కొట్టింది. మొత్తానికి సుచిలీక్స్ వ్యవహారం నుంచి కోలుకున్న త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి అభిమానులను హుషారులో ముంచెత్తింది. అమ్మడు వరుసగా ఫోటోలు పోస్ట్ చేస్తుండడం.. ట్వీట్స్ పెడుతుండడం చూసి.. త్రిష ఈజ్ బ్యాక్ అని సంబర పడిపోతున్నారు ఫ్యాన్స్.

ఇంత సడెన్ గా త్రిష యాక్టివ్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే.. ఈమెపై వస్తున్న పుకార్లే. హైద్రాబాద్ లో హాస్పిటల్ లో జాయిన్ అయిందని.. హెల్త్ డిస్టర్బ్ అయిందనే రూమర్స్ తో పాటు.. అందుకు రకరకాల కారణాలు కూడా ప్రచారం అవుతున్నాయి. అదేమీ లేదని త్రిష మమ్మీ చెప్పినా మీడియా జనాలు నమ్మకపోవడంతో.. ఇక తనే రంగంలోకి దిగింది చెన్నై బ్యూటీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News