చైతూ హిందీ సినిమా వాయిదాకు అసలు కారణం ఇదేనా!

Update: 2021-09-30 14:30 GMT
అక్కినేని హీరో నాగచైతన్య మొదటి సారి హిందీలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. గత ఏడాదిలోనే ఈ సినిమా విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల వాయిదా పడింది. చిత్రీకరణ పూర్తి అయ్యి సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. షూటింగ్ ముగిసినా కూడా సినిమా వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా కు తీవ్ర పోటీ ఉండటం వల్లే క్రిస్మస్‌ బరి నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

లాల్ సింగ్ చద్దా సినిమా చిత్రీకరణ అనుకున్న తేదీకి ముగించలేక పోయామని.. అందుకే సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. కాని అసలు విషయం ఏంటీ అంటే క్రిస్మస్ కు 83.. జెర్సీ.. సిర్కస్‌ ఇంకా కొన్ని చిత్రాలు విడుదల కు సిద్దం అవుతున్నాయి. అందుకే లాల్‌ సింగ్ చద్దా సినిమాను పోటీ లేని ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించారట. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయడం కోసం మంచి సమయం ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. తెలుగు లో నాగచైతన్య కోసం ఈ సినిమాను చూసేందుకు చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని అమీర్ ఖాన్ భావిస్తున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చైతూ తదుపరి సినిమా బంగార్రాజు వచ్చే సంక్రాంతికి వస్తుందని అంటున్నారు. ఒక వైపు థ్యాంక్యూ సినిమాను కూడా విడుదలకు సిద్దం చేస్తున్నారు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా విడుదల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు థ్యాంక్యూ గురించి అధికారికంగా ఎలాంటి అప్డేట్‌ లేదు. ఇటీవల లవ్‌ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాగా వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్‌ నాగ చైతన్య సినిమాలు రాబోతున్నాయి. అందులో లాల్‌ సింగ్ చద్దా సినిమా కూడా ఒకటి అనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News