మెగాస్టార్ చిరంజీవి మరియు చరణ్ లతో సినిమాలను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్న ఈ సమయంలో రెబల్ స్టార్ ఫ్యామిలీకి చెందిన యూవీ బ్యానర్ కి ఆ ఛాన్స్ దక్కింది. ప్రభాస్ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్ ల ఆధ్వర్యంలో సాగుతున్న యూవీ క్రియేషన్స్ లో రామ్ చరణ్ మూవీ చాలా కాలం క్రితమే పట్టాలెక్కాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా మొదలు అవ్వలేదు. రామ్ చరణ్ కు వారిద్దరు అత్యంత సన్నిహితులుగా పేరున్నారు. అందుకే స్నేహితుల కోసం ఏ సమయంలో అయినా డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడట. తాను మాత్రమే కాకుండా తన తండ్రి చిరంజీవిని కూడా యూవీ క్రియేషన్స్ లో నటింపజేసేందుకు చరణ్ ఓకే చెప్పాడని.. అందుకోసం చిరు కూడా సిద్దంగా ఉన్నాడంటూ సమాచారం అందుతోంది. యూవీ క్రియేషన్స్ లో ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలు.. చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రమే వచ్చాయి. మొదటి సారి భారీ సినిమాలను వేరే హీరోలతో వీరు చేయబోతున్నారు.
యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న రామ్ చరణ్ మరియు చిరంజీవిల సినిమాలను వచ్చే ఏడాదిలో యూవీ క్రియేషన్స్ వారు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. లాంచనంగా ప్రారంభం అయిన చరణ్ శంకర్ ల మూవీ వచ్చే ఏడాది చివరి వరకు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉంది. అప్పటికి చరణ్ తో యూవీ వారు సినిమాను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో చిరంజీవితో సినిమాను కూడా యూవీ వారు వచ్చే ఏడాదిలోనే ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే చిరంజీవి ఆచార్య ను ముగించాడు.. మరో వైపు గాడ్ ఫాదర్ మరియు భోళ శంకర్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. చిరంజీవి తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్న సినిమాకు తమిళ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తండ్రి కొడుకులతో ఒకే సారి యూవీ క్రియేషన్స్ వారు సినిమాలను నిర్మించే అవకాశం దక్కించుకోవడం చాలా పెద్ద విషయం. ప్రభాస్ హోమ్ బ్యానర్ గా.. రెబల్ బ్యానర్ గా పేరు దక్కించుకున్న యూవీ క్రియేషన్స్ కు ముందు ముందు మెగా తండ్రి కొడుకుల సినిమాలతో టాప్ బ్యానర్ గా పేరు దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చిరంజీవి మరియు చరణ్ లు కలిసి ఆచార్య లో నటించగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇద్దరు వేరు వేరు సినిమాలను చేయబోతున్నారు. రెబల్ బ్యానర్ లో మెగా తండ్రి కొడుకుల సినిమాలు 2023 కు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.