యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది. ఇది కొనసాగుతుండగానే.. మరో మూడు చిత్రాలను లైన్లోకి వచ్చాయి. ఇందులో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'సలార్' ఒకటి కాగా.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' రెండోది. ఇక మహానటితో ఆకట్టుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించబోతున్న సైన్స్ ఫిక్షన్ మూడోది. అయితే.. వీటిల్లో సలార్ ఈ మధ్యనే ప్రారంభమైంది. అతి త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కాబోతోంది.
కేజీఎఫ్ తో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. ఇతనితో ప్రభాస్ సినిమా చేస్తుండడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ హై-ఓల్టేజ్ కాంబో మూవీ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ రఫ్ అండ్ టఫ్ గా ఉంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమాలో ప్రముఖ తమిళ్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోందన్నది ఆ వార్త సారాంశం. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట.
ఇక్కడ దాదాపు పది రోజుల పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సెట్ నిర్మిస్తున్నారని అంటున్నారు. ఆ పనులు పూర్తవగానే చిత్రబృందం ఇక్కడకు వస్తుందట. మరి, ఇందులో నిజం ఎంతన్నది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.