అబ్బాయ్ ని డైరెక్ట్ చేయాలన్నది పెదనాన్న కృష్ణంరాజు ఆలోచన. కానీ ఏదీ ఆ `ఒక్క అడుగు` పడదేం? ఇలా ఇంకెన్నాళ్లు? గత కొంతకాలంగా రెబల్ స్టార్ పై మీడియా విసిరిన పంచ్ లు ఇవి. దీనికి సరైన సమాధానం చెబుతారనే భావించారు. నిజానికి దీనికోసం కృష్ణంరాజు చాలా కసరత్తు చేసారు. కానీ ఆ ఒక్క అడుగు పడకుండానే ఆయన అంతర్దానం అయ్యారు. నింగిలో తారలా మెరిసారు.
ప్రభాస్ కథానాయకుడిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో సోలోగా ఓ సినిమా తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. `ఒక్క అడుగు` అనే టైటిల్ ని కూడా చాలా కాలం క్రితం ప్రకటించారు. బాహుబలి ప్రారంభానికి ముందే `ఒక్క అడుగు` ప్రారంభమవుతుందని అన్నారు. కానీ ఇప్పటివరకూ పట్టాలెక్కించలేకపోయారు.. ప్రభాస్ వేరే వేరే సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తున్నాడు తప్ప! `ఒక్క అడుగు` పై దృష్టి సారించలేదని తర్వాత పరిణామాలే చెప్పాయి. మూడు నాలుగేళ్ల క్రితం బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించి పెదనాన్న కృష్ణంరాజు స్వయంగా డీటెయిల్స్ వెల్లడించారు.
ప్రభాస్ కటౌట్ కు అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ అయ్యిందని... చక్కని సామాజిక సందేశంతో కూడుకున్న సినిమా అవుతుందని... `ఒక్క అడుగు` తో వేయి అడుగుల పడేలా ఇన్ స్పైర్ చేసే కథాంశం కుదిరిందని చెప్పారు. కృష్ణం రాజు స్వయంగా ఈ కథను సిద్దం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ సందర్భంలో మీరే డైరెక్ట్ చేయోచ్చు కదా? అని మీడియా ప్రశ్నించగా `తాను ఆసక్తిగానే ఉన్నాన`ని తెలిపారు. అయితే అది నేను చేయాలనే రూలేం లేదు. నేను నిర్మిస్తాను. పూరి జగన్నాథ్ చేసినా తనకు ఓకే అని కూడా అన్నారు. ప్రభాస్ కి వీలు చిక్కగానే సెట్స్ కు వెళతామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఆ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు.
బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చేసాడు. తర్వాత రాధేశ్యామ్.. ఆ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాల గురించి తెలిసిందే. చాలా సినిమాల్లో నటిస్తున్నాడు గానీ! పెదనాన్న డ్రీమ్ ప్రాజెక్టును మాత్రం పట్టాలెక్కించలేకపోయాడు. నిజంగానే ఒక్క అడుగు గనుక పడితే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేదేమో అనే చర్చా అభిమానుల్లో సాగింది. చివరికి కృష్ణంరాజు తన కల నెరవేరకుండానే అందని తీరాలకు చేరుకున్నారు. ఈ లోటు ప్రభాస్ ని ఎప్పటికీ నీడలా వెంటాడుతుందనడంలో సందేహం లేదు. కారణం ఏదైనా కానీ పెదనాన్న దర్శకత్వంలో నటిస్తానని మాటిచ్చి దానిని నెరవేర్చలేకపోయాడు!