రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరన్న వార్తల నడుమ ఆయన జ్ఞాపకాల్లోకి వెళుతున్నారు అభిమానులు. కృష్ణంరాజుకు నెరవేరని రెండు కోరికలు ఉన్నాయి. వాటిలో ఒకటి అబ్బాయ్ ప్రభాస్ ని తానే స్వయంగా డైరెక్ట్ చేయడం.. రెండోది ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పని చేయడం. కానీ ఆ రెండు కోరికలు నెరవేరలేదు.
గవర్నర్ గిరీపై రెబల్ స్టార్ కృష్ణంరాజు మనసుపడ్డారని తెలుగు మీడియాలో చాలా కాలంగా కథనాలొస్తూనే ఉన్నాయి. గత కొంత కాలంగా ఈ విషయంలో మోదీని.. బీజేపీ ఛీఫ్ అమిత్ షాని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించినట్టు కూడా గుసగుసలు వినిపించాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన `బాహుబలి` రిలీజ్ తరువాత ప్రభాస్ ని వెంటపెట్టుకుని వెళ్లి ప్రధాని మోదీజీతో పాటు పార్టీ అధ్యక్షులుగా ఉన్న అమిత్ షాని.. సీనియర్ నాయకుడు రాజ్ నాథ్‌సింగ్ ని కూడా రెబల్ స్టార్ కలిసారు. వారితో ఫొటోలకు పోజులిచ్చిన కృష్ణంరాజు పార్టీ పెద్దల నుంచి గవర్నర్ పోస్టుకు సంబంధించి ఎలాంటి హమీనీ పొందలేకపోయారని కూడా టాక్ వినిపించింది. అప్పట్లో వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లని కేంద్రం నియమించింది. ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించారు. ఇతర రాష్ట్రాలకు కూడా కొత్త బాస్ లని నియమించారు.
ఎందరికి ఏం చేసినా కానీ రెబల్ స్టార్ ని మాత్రం పార్టీ మరిచిందని ఆవేదన అభిమానుల్లో వ్యక్తమైంది. చాలా కాలంగా బీజేపీతో ప్రయాణిస్తున్న కృష్ణంరాజు మధ్యలో ప్రజారాజ్యం బోటెక్కారు. కానీ అక్కడ ఆశించినది జరగలేదు. చివరికి చేసేది లేక మళ్లీ బీజేపీని ఆశ్రయించారు. ఈ జంపింగ్ వల్ల కూడా ఆయనకు గవర్నర్ పదవి దక్కలేదని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక బీజేపీలో వున్నా ఆరోగ్యం సహకరించకో లేక ఇంకేదైనా కారణం వల్లనో కానీ ఆయన యాక్టీవ్ గా ఎన్నడూ కనిపించలేదు. ఇది కూడా గవర్నర్ గిరీ దక్కకపోవడానికి కారణం అన్న వాదనా వినిపించింది.
ఈ విషయం పసిగట్టిన కృష్ణంరాజు తన యాక్టీవ్ నెస్ ని నిరూపించుకోవడం కోసం ఏకంగా చంద్రబాబు నాయుడిపైనే దూకుడు ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఎన్నడూ బాబుపై విమర్శలు చేయని కృష్ణంరాజు అప్పట్లో ``చంద్రబాబు ఓ చచ్చిన పాముతో సమానం`` అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతటితో ఆగక ``మోసాలు చేయడంలో.. ఏమార్చడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశాడు`` అని పరువుతీసినంతపని చేశారు. గవర్నర్ గిరీ కోసం బాబుని టార్గెట్ చేయాలా? అని తెలుగు తమ్ముళ్లు ఫీలయ్యారు కూడా.
ఇంత చేసినా కృష్ణంరాజును గవర్నర్ గా నియమించాలన్న ఊహ కూడా బీజేపీకి రాలేదని గుసగుసలు వినిపించాయి. రెబల్ స్టార్ ఎంతగా ప్రయత్నించినా ఆయనకు గవర్నర్ పదవిని బీజేపీ కట్టబెట్టే ఆలోచన చేయకపోవడం అభిమానుల్ని నిరాశపరిచింది. చివరికి ఆ కల నెరవేరకుండానే ఆయన అంతర్ధానమయ్యారు.