రికార్డు సృష్టించిన స్కామ్ 1992..!

Update: 2021-06-12 03:30 GMT
'స్కామ్ 1992. ది హర్షద్ మెహతా స్టోరీ' వెబ్ సిరీస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ తాజాగా మరో ఘనతను సాధించింది. స్కామ్1992 వెబ్ సిరీస్ ఐఎండిబి రేటింగ్స్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన 250 వెబ్ సిరీస్ అండ్ టెలివిజన్ సీరియల్స్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. ప్రతీక్ గాంధీ టైటిల్ రోల్ పోషించిన ఈ వెబ్ సిరీస్ 1992 వరకు దేశంలో జరిగిన అతిపెద్ద సెక్యూరిటీస్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కింది.

IMDb రేటింగ్‌స్ లో 10 పాయింట్లకు గాను మూవీస్ - టీవీ షోస్ వీక్షకులచే రేటింగ్ ఇవ్వబడతాయి. ప్రస్తుతం స్కామ్ 1992.. 10 పాయింట్స్ రేటింగ్ లో 9.6 రేటింగ్ పొంది రికార్డు క్రియేట్ చేసింది. 2020లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ IMDb టాప్ 10 ఇండియన్ వెబ్ సిరీస్ జాబితాలో అత్యధిక యూజర్-రేటెడ్ షోగా అవతరించింది. మరి ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 250 టీవీ షోస్ అండ్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్‌లలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ షోగా రికార్డు సృష్టించింది. అయితే స్కామ్ 1992తో పాటు వివిధ విభాగలలో బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్, బ్రేకింగ్ బాడ్, ది వైర్ అలాగే చెర్నోబిల్ ఉన్నాయి. స్కామ్ 1992 ప్రస్తుతానికి 9వ స్థానంలో ఉంది, కానీ ర్యాంకింగ్ అనేది పర్మినెంట్ కాదు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.

ఇది స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా కథ చుట్టూ తిరుగుతుంది. అతను 1992లో సెక్యూరిటీల కుంభకోణానికి పాల్పడ్డాడు. ఇది స్టాక్ మార్కెట్ అలాగే బ్యాంకుల పనితీరులో అనేక లొసుగులను బహిర్గతం చేసే విధంగా రూపొందించారు. అయితే హర్షద్ క్యారెక్టర్ పోషించిన ప్రతీక్ గాంధీ తాజాగా మాట్లాడటం జరిగింది. ప్రతీక్ మాట్లాడుతూ.. "ఇది చాలా సంతోషకరమైన సమయం. ఇంతటి విజయం మానసికంగా మనలను బలపరుస్తుంది. అలాంటి ఐఎండిబి లాంటి గ్రేట్ షోస్ జాబితాలో ఇండియా తరపున 'స్కామ్ 1992' ఒకటే లిస్టులో చేరడం ఆనందంగా ఉంది." అన్నాడు. అలాగే స్కామ్ 1992కి అన్ని వయసుల వారినుండి మంచి రెస్పాన్స్ వస్తుందని ప్రతీక్ తెలిపాడు. ప్రస్తుతం ఫైనాన్షియల్ జర్నలిస్టులు సుచేతా దలాల్ - దేబాషిష్ బసు రాసిన ది స్కామ్: హూ వోన్, హూ లాస్ట్, హూ గాట్ అవే అనే పుస్తకం ఆధారంగా సోనీలైవ్‌లో స్కామ్ 1992 ప్రసారం అవుతోంది.
Tags:    

Similar News