సీత ఐటెం సాంగ్ మీద రెడ్ల గుస్సా?

Update: 2019-04-03 12:45 GMT
ఒకప్పుడు సినిమాల్లో రెడ్లను కేవలం ఫ్యాక్షన్ నేపధ్యంలో విలన్లుగా చూపించే ట్రెండ్ టాలీవుడ్ లో కొన్నేళ్ళ పాటు రాజ్యమేలింది. చిరంజీవి బాలకృష్ణ మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ లాంటి యూత్ హీరోస్ దాకా అందరూ ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసుకుని హిట్లు కొట్టినవాళ్ళే. అయితే వాటిలో హీరో పాత్రలు కూడా రెడ్లే కాబట్టి ఆ సామజిక వర్గం నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.

కాలక్రమేణా ఈ ట్రెండ్ తర్వాత బాగా తగ్గుముఖం పట్టింది. గత సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవలో మళ్ళి ఈ నేపధ్యాన్ని వాడుకునే దాకా అందరూ దాదాపు మర్చిపోయారు. ఇప్పుడు దర్శకుడు తేజ అందుకే కాస్త భిన్నంగా ఆలోచించి సీత సినిమాలో ఐటెం సాంగ్ ఓ రెడ్డిలను రసిక ప్రియులుగా చూపించే ప్రయత్నం చేయడం ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కోపం తెప్పిస్తున్నట్టుగా వినికిడి

పల్లవిలో పది పదిహేను సార్లు వివిధ పేర్లు రెడ్డి ఉపమానంతో వస్తూనే ఉంటాయి. అంటే రెడ్లందరూ తన మీద వస్తున్నారు అనేలా పాయల్ రాజ్ పుత్ పాత్ర ఆపాటను పాడుతుందన్న మాట. అయితే ఇలాంటి మసాలా పాటలో తమను అలా చూపించడం ఏమిటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. అసలే మనోభావాలు చాలా సున్నితంగా మారిన తరుణంలో ఇప్పుడీ రెడ్డి సాంగ్ ఏదో రచ్చ చేసేలా ఉంది.

హీరో హీరొయిన్లకు సంబంధించి కాకుండా మొదటి ఆడియో సింగల్ ఇలా ఐటెం సాంగ్ రిలీజ్ చేయడంలో దర్శకుడు తేజ అంతర్యం ఇదేనా అనే డౌట్ కూడా సినిమా జనానికి వస్తోంది. చూడాలి నిజంగా ఈ నిరశన సీత టీంని తాకుతుందా లేక ఎన్నికల హడావిడిలో సైడ్ అయిపోతుందా అనేది. అప్పటిదాకా చూస్తూ ఉండటమే మనం చేయగలిగింది
Tags:    

Similar News