నగరం కోసం గరంగరంగా నగరంలో!!

Update: 2017-03-15 07:09 GMT
టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రాకు.. ఇప్పుడు తెలుగులో అవకాశాలు అంతగా లేవన్న మాట నిజమే. కెరీర్ ను తమిళంలో ప్రారంభించిన ఈ బ్యూటీకి.. హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినది మాత్రం తెలుగు సినిమాలే. అయితే.. ప్లానింగ్ లోపాల కారణంగా.. ఇక్కడ అవకాశాలు అడుగంటిపోయాయి. ప్రస్తుతం కృష్ణవంశీ మూవీ నక్షత్రంలో మినహాయిస్తే.. ఈ భామకు మరో తెలుగు సినిమా చేతిలో లేదు.

తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న రెజీనా.. చాలా వారాల తర్వాత మళ్లీ హైద్రాబాద్ నగరంలో కనిపించింది. నగరం మూవీ సక్సెస్ మీట్ కు హాజరైన రెజీనా.. డార్క్ గ్రే కలర్ స్లీవ్ లెస్ వేర్ తో గరంగరం లుక్స్ ఇచ్చేసింది. తమిళ్ లో మానగరం.. తెలుగులో నగరంగా రిలీజ్ అయిన మూవీ సక్సెస్ ను రెజీనా ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోందో.. ఆమె ఫేస్ చూస్తేనే అర్ధమవుతుంది. చాలా నెలల తర్వాత విజయం దక్కడంతో.. ఆ ఆనందాన్ని దాచుకోలేకపోతోంది రెజీనా.

'నగరం మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్. ఈ సినిమాపై నమ్మకంతోనే ముందుగానే మీడియాకి ప్రదర్శించారు. రిలీజ్ అయిన దగ్గర నుంచి బోలెడన్ని ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రం తమిళ్ నేటివిటీతో ఉన్నా సరే.. ఆంధ్రా తెలంగాణల్లో కూడా ప్రేక్షకులు ఆదరించారు. కనెక్టివిటీ మిస్ అయినా కూడా అందరూ ఇష్టపడ్డం చాలా సంతోషాన్ని ఇచ్చింది' అని చెప్పింది రెజీనా కసాండ్రా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News