రెజీనా పరిస్థితేంటీ.. అక్కడైనా సత్తా చాటుతుందా?

Update: 2021-02-08 12:50 GMT
కొందరు హీరోయిన్లు అరంగేట్రంలోనే యావ‌త్ ఇండ‌స్ట్రీని త‌మ వైపు తిప్పుకుంటారు. కానీ, ఎంత వేగంగా లైమ్ లైట్లోకి వ‌స్తారో.. అంతే వేగంగా చీక‌ట్లోకి వెళ్లిపోతారు. హీరోయిన్ రెజీనా ఈ కోవ‌కే చెందుతుంది. ఒకప్పుడు తెలుగు తెర‌పైకి సునామీలానే దూసుకొచ్చిన బ్యూటీ.. ఆ త‌ర్వాత అట్ట‌డుగుకు జారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మ‌డి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

రెజీనా ఆఖ‌రుగా చేసిన‌‌ తెలుగు మూవీ 'ఎవరు?'. ఆ సినిమా సక్సెస్ అయ్యింది కూడా. అయిన‌ప్ప‌టికీ.. మ‌రో ఆఫ‌ర్ రాలేదు ఈ కోలీవుడ్ భామ‌కు. మ‌రి, ఇక్కడ ఆఫర్స్ రావటం లేదో.. మ‌రేదైనా కార‌ణం ఉందోగానీ టాలీవుడ్లో లేకుండా చెన్నై చెక్కేసింది ఈ బ్యూటీ. పోనీ.. కోలీవుడ్ లోనైనా రేసులో ఉందా అంటే.. అదీ లేదు. అక్క‌డ కూడా క‌ష్ట కాలాన్నే ఫేస్ చేస్తోంది.

త‌మిళ్ లో రెజీనా న‌టించిన 'నెంజమ్ మరప్పతిల్లై' అనే సినిమా మార్చ్ 5న విడుదల కాబోతోంది. అయితే.. వాస్త‌వానికి ఏ సినిమా గ‌తేడాదే రిలీజ్ కావాల్సి ఉంది. అంటే.. లాక్ డౌన్ క‌న్నా ముందే విడుద‌ల కావాల్సి ఉంది. అనేక అవాంతరాలు రావ‌డంతో.. చాలా ఆల‌స్యంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. 'నెంజమ్ మరప్పతిల్లై' మూవీ హారర్ పిక్చ‌ర్‌.

ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా స్వ‌ర క‌ల్ప‌న‌లో వ‌స్తున్న ఈ మూవీపైనే రెజీనా ఆశ‌లన్నీ పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితేనే రెజీనా తమిళంలో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే.. అమ్మ‌డి సినీ జీవితం ప్రమాదంలో ప‌డే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు. మ‌రి, రెజీనా సినీ కెరీర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Tags:    

Similar News