టాలీవుడ్ లో నెక్ట్స్ జెన్ టాప్ హీరోయిన్ స్లాట్ కు రెజీనా కసాండ్రా పోటీ ఇస్తుందనే అంతా అనుకున్నారు. కానీ అమ్మడికి టైమ్ కలిసిరాలేదు. కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటాననడం అప్పట్లో ఆఫర్లకు దూరం చేసింది. ఓ హీరోకి సన్నిహితురాలు అనిపించుకున్నా సరే.. అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. అదృష్టం కలిసి రాని రెజీనా.. ఇప్పుడు పక్క భాషల వైపు వెళ్లేందుకు రెడీ అవుతోంది.
అయితే.. ఆ తప్పంతా తెలుగు ప్రేక్షకులదే అన్నట్లుగా చెబుతోంది ఈ భామ. 'తమిళ ప్రేక్షకులు చాలా మంచి వాళ్లు. ఏడాదికి ఒక్క సినిమానే చేసినా సరే.. వాళ్లు గుర్తుంచుకుంటారు. కానీ తెలుగులో మాత్రం ప్రతీ శుక్రవారం ఓ కొత్త హీరోయిన్ వస్తూ ఉంటుంది. అందుకే ఆడియన్స్ తేలిగ్గా మర్చిపోతుంటారు. అందుకే నేను తమిళ్ పై ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోలీవుడ్ లో 5 సినిమాలు చేస్తున్నా' అంటూ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది రెజీనా.
ఇది తెలుగు ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయడం తప్ప మరింకేమీ కాదనే విషయం అర్ధమవుతూనే ఉంది. ఆఫర్స్ అందుకుని సినిమాలు చేస్తే చూస్తారు కానీ.. అసలు సినిమాలే లేకుండా ఆదరించడం ఎలాగో రెజీనాకే తెలియాలి. అయినా.. ప్రతీ శుక్రవారం కొత్త హీరోయిన్ వస్తుందని చెబుతోంది కానీ.. తను కూడా అలా వచ్చిందే కదా.. ఆ విషయం మర్చిపోయినట్లుంది.