చేప పిల్లలా అలలతో ఆడుతున్న రెజీనా

Update: 2015-07-17 03:54 GMT
ఇంతకీ డస్కీ హీరోయిన్‌ రెజీనా ఏం చేస్తోంది? అబ్బే ప్రస్తుతం తన సినిమాల తాలూకు షూటింగ్స్‌ అన్నీ అయిపోయాయ్‌ అంటా.. అందుకే అమ్మడు తనకు తగ్గ స్పోర్ట్‌ ఒకటి ఎంచుకుంది. చూడ్డానికి బక్కగా చలాకీగా ఉంటుంది కదా.. అందుకే ఒక మెర్మయిడ్‌ టైపులో అర్జెంటుగా సముద్రాన్ని ఈదేద్దాం అనుకుంటోంది అమ్మడు. అయితే తన చేతుల రెక్కలతో కాకుండా, ఒక సర్ఫ్‌ బోర్డు సహాయంతో ఈదితే ఎలా ఉంటుంది?

ప్రస్తుతం చెన్నయ్‌ కోవాలం బీచ్‌లో ఉన్న సర్ఫింగ్‌ పాయింట్‌లో అమ్మడు గింగిరాలు కొడుతోంది. ఖాళీ దొరికితే చాలు.. తన సర్ఫ్‌ బోర్డు వేసుకొని అలలపై ఈత కొట్టేస్తోంది అమ్మడు. ఒక ట్రైనర్‌ సహాయంతో ఆల్రెడీ చాలా వరకు సర్ఫింగ్‌ నేర్చేసుకుందట. గత మూడు నెలలుగా ఎప్పుడు టైమ్‌ దొరికినా కూడా చెన్నయ్‌ వెళ్ళిపోయి సర్ఫింగ్‌ చేస్తున్నాని చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడు ఇన్‌్‌స్టాగ్రామ్‌లో వీటి తాలూకు వీడియోలు కూడా పెడుతుంటుంది అమ్మడు.

ఇకపోతే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈవిడ ఆశలన్నీ సాయి ధరమ్‌ తేజ్‌ సరసన నటిస్తున్న సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ పైనే ఉన్నాయి. ఈ సినిమా కాకుండా మంచు క్యాంపులో ఓ రెండు సినిమాలు చేస్తోందిలే. అది సంగతి.

https://instagram.com/p/5NNv0SBa0K/
Tags:    

Similar News