చెన్నైలో గారం చేస్తున్న రెజీనా

Update: 2016-03-08 07:30 GMT
రెజీనా కసాండ్రాకి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ హీరోయిన్ గా బోలెడంత గుర్తింపు ఉంది. ఈ మధ్య గ్లామర్ డాల్ ఇమేజ్ కోసం కూడా బాగానే కష్టపడుతోంది. రకరకాల డ్రస్సులతో కొత్తగా ట్రై చేస్తూ - క్లీవేజ్ ఎక్స్ పోజ్ చూస్తూ.. కెరీర్ ని పరుగులు పెట్టించడానికి తెగ ప్రయత్నిస్తోంది. అయితే ఎంత కష్టపడ్డా ఇక్కడ ఈమెకు బ్రేక్ మాత్రం రావడం లేదు. ఆశించిన స్థాయి హిట్ అందడం లేదు. ఒకవేళ ఏదైనా సినిమా కొద్దో గొప్పో ఆడినా.. ఆ క్రెడిట్ ఈమె ఖాతాలో పడ్డం లేదు.

దీంతో ఇప్పుడు రెజీనా రూట్ మార్చి, చెన్నైలో అడుగుపెడుతోంది. అసలు ఈమెది కూడా చెన్నైనే. కానీ ఇక్కడ వరుస అవకాశాల కారణంగానే టాలీవుడ్ లో సెటిల్ అయింది. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా లక్ ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ఈ భామ 'మానగారం' అనే కోలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇవి కూడా కంప్లీట్ కాగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేయనున్నారు యూనిట్.

ఈ 'మానగారం'లో రెజీనాతో పాటు సందీప్ కిషన్ - శ్రీ కూడా నటిస్తుండగా... కొత్త డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి కోలీవుడ్ అయినా.. ఈ అమ్మడిని ఆదుకుంటుందా? ఏళ్ల తరబడి రెజీనా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ అందిస్తుందా? ఇప్పుడే చెప్పలేం కానీ.. రెజీనా కసాండ్రా మాత్రం కోలీవుడ్ మూవీపై చాలానే ఆశలు పెట్టుకుంది.
Tags:    

Similar News