రెజీనాకు బ్రేకిచ్చే లుక్ ఇదేనా!!

Update: 2016-10-16 09:39 GMT
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం శరవేగంగా రూపొందుతోంది. కేరక్టరేజేషన్ నుంచి ప్రతీ యాంగిల్ లోనూ డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్న కేవీ.. ప్రమోషన్స్ లో కూడా కొత్తగా వెళుతున్నాడు. ప్రతీ సినిమాకి కేరక్టర్ ఇంట్రడక్షన్ ఇప్పుడు కామన్ గా కనిపిస్తున్నా.. రామ్ చరణ్ ను లైన్ లోకి తీసుకొచ్చి మన క్రియేటివ్ డైరెక్టర్ మాత్రం ఆ థీమ్ ను కొత్తగా మార్చేశాడు.

వరుసగా చెర్రీ చేతుల మీదుగానే నక్షత్రం లుక్స్ లాంఛ్ అవుతుండగా.. ఇప్పుడు నాలుగో లుక్ రూపంలో రెజీనా ఫస్ట్ లుక్ లాంఛ్ అయింది. ఆ మధ్య రెజీనా లంబాడీ లుక్ లో కనిపించే ఫోటో బయటపడితే.. అమ్మడి కేరక్టర్ అదే అనుకున్నారు. కానీ ఇప్పుడు చెర్రీ లాంఛ్ చేసిన లుక్ లో మాత్రం.. అల్ట్రా మోడర్న్ అసలు సిసలైన కేరాఫ్ అడ్రస్ టైపులో కనిపిస్తోంది. షార్ట్ డ్రస్సులు వేయడంలో అమ్మడికి అబ్జెక్షన్స్ ఉండవని తెలుసు కానీ.. కృష్ణవంశీ తన స్టైల్ లో బాగా ప్రజెంట్ చేసేశాడు.

సాధారణంగా కృష్ణవంశీ సినిమాలంటే హీరోయిన్ల పాత్రలకు.. వాళ్ల గెటప్ లకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందనే విషయం.. నక్షత్రం విషయంలో మరోసారి ప్రూవ్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. రెజీనా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్రేక్ ని నక్షత్రంతో కృష్ణవంశీ అందిస్తాడని ఆశించచ్చంటారా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News