చివరిసారిగా పవర్ సినిమాలో కనిపించింది రెజీన. కొత్త జంటతో విజయం అందుకుని ఆ వెంటనే మరో పవర్‌ఫుల్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల స్థాయికి ఎదిగేసిందని అంతా ముచ్చటించుకున్నారు. ఇంకేం ఉంది? మెగా హీరోల్లో స్టార్ హీరోల సరసన నటించడమే బ్యాలెన్స్ అనుకున్నారు.
కానీ ఆర్నెళ్లుగా రెజీన సందడి అస్సలు కనిపించడం లేదు. కేవలం హరీష్ శంకర్ దర్శకత్వంలోని 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం తప్ప అమ్మడికి వేరొక అవకాశం ఉందో లేదో తెలీని పరిస్థితి. ఈ చిత్రం కోసం పూర్తిగా బల్క్‌గా డేట్స్ కేటాయించింది. సాయిధరమ్‌కి ఎట్టి పరిస్థితిలో మరో హిట్ అందించాలని ఫిక్సయినట్టుంది. అందుకే ఒకసారి ఒకే సినిమా అన్న ఫార్ములాకి కట్టుబడి ఉంది రెజీన. ప్రస్తుతం సుబ్రహ్మణ్యంతో కలిసి దేశ విదేశాలు తిరిగొస్తోంది.
ఇదిగో ఇటీవలి కాలంలో ఈ రేంజు స్టయిలిష్ లుక్‌లో దర్శనమిచ్చిందే లేదు. బులుగు జిలుగు డిజైనర్ వేర్‌లో, తెల్ల చారల కాంబినేషన్ డ్రెస్ అదిరిపోయింది. కాంబినేషన్ బులుగు కళ్లద్దాల మ్యాచింగ్ సూపర్బ్. అయితే ఇలాంటి స్టయిల్స్‌కి పడిపోయి మన నిర్మాతలెవరూ ఈ అమ్మడి వెంట పడుతున్నట్టు లేదు. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయ్! సొల్యూషన్ ఎప్పటికి కనిపెడుతుందో?