గత ఏడాది రెజీనా కసాండ్రా జోరు చూస్తే.. త్వరలోనే టాప్ లీగ్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోతుందనే అనుకున్నారంతా. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో ఓ పక్క అందం.. మరో పక్క అభినయంతో ఫుల్ మార్కులు కొట్టేయడంతో ఇక ఆమెకు పెద్ద హీరోల పక్కన ఛాన్సులొచ్చేస్తాయని అంచనా వేశారు. కానీ ‘సౌఖ్యం’ సినిమా ఆమె కెరీర్ కు పెద్ద బ్రేకే వేసింది. ప్రస్తుతం తెలుగులో ఆమె ఒకే ఒక్క సినిమా మాత్రమే చేయబోతోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘జ్యో అచ్యుతానంద’లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇది తప్ప రెజీనాకు తెలుగులో ఒక్కటంటే ఒక్క ఛాన్స్ లేదు. ఇంతకుముందు మెగా హీరోల సరసన మూడు సినిమాలు చేసిన రెజీనాకు.. ఇప్పుడు ఆ ఫ్యామిలీ హీరోలు కూడా ఛాన్సులివ్వట్లేదు.
మీడియం రేంజి సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలకు ప్రమోట్ అవుతుందేమో అనుకుంటే.. అసలు చిన్న-మీడియం సినిమాలు కూడా లేకుండా పోయిన పరిస్థితిలో ఉంది రెజీనా. ఆమెకు ఇప్పటికే 27 ఏళ్లు వచ్చేశాయి. కెరీర్లో పీక్స్ అందుకుంటే ఇప్పుడే అందుకోవాలి. ఇంకో రెండేళ్లు పోయాయంటే అసలు హీరోయిన్ గా కెరీరే ముగిసిపోతుంది. ఓ పక్క తెలుగులో హీరోయిన్ల కొరత కనిపిస్తున్నా.. అందం-అభినయం రెండూ ఉన్న రెజీనాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం విచిత్రమే. ఐతే తన మాతృభాష తమిళంలో మాత్రం రెజీనాకు ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె ఖాతాలో మూడు తమిళ చిత్రాలున్నాయిప్పుడు.