రెజీనా షార్ట్ ఫిలిం!

Update: 2016-03-28 11:30 GMT
'రొటీన్ లవ్ స్టోరీ' -'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి రెజీనా. ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్ గా మారింది. సెలబ్రీటీ చుట్టూ గాసిప్‌ లు - రూమర్స్‌ వేరీ కామన్. కొందరు తారలు వీటిని లైట్ గా తీసుకుంటే మరి కొందరికి ఇవి తీవ్ర మనోవేదన కలిగిస్తాయి. అలానే రెజీనా మీద కూడా రూమర్స్ అనేవి వచ్చాయి. ఓ మెగా హీరోతో ఈ అమ్మడు ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఇలాంటి గాసిప్స్ కొన్నిసార్లు హద్దులు దాటి సదరు తారల వ్యక్తిగత జీవితంలో పెను కలకలం రేపుతుంటాయి. వీటి వలన స్టార్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారో చెప్పడానికి ఇప్పుడు హీరోయిన్ రేజీనా ఏకంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది. ఇందులో స్వయంగా ఆమెనే నటించింది. 'మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట..? మీకు ఆయనతో ఎఫైర్ అంట..? ఇలా ఈ 'అంట' అనే మాటతో వినిపించే గాసిప్స్.. తమకు, తమ కుటుంబానికి ఎంత వేదనకు గురి చేస్తాయో అన్నది ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసిందీ భామ..
Full View

Tags:    

Similar News