రెజీనా మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది. `కొత్త జంట` మొదలు వరుసగా మెగా హీరోలతో కలిసి నటిస్తోంది. దీంతో ఆమెని అంతా మెగాహీరోయిన్ అని పిలవడం మొదలుపెట్టారు. మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ తో `పిల్లా నువ్వు లేని జీవితం` సినిమా చేసి హిట్టందుకొంది రెజీనా. ఇప్పుడు ఆయనతోనే `సేల్ ఫర్ సుబ్రమణ్యం`లో నటిస్తోంది.
వరుణ్ తేజ్ తో కూడా కలిసి నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తదుపరి సినిమాలు ఎవరితో చేస్తుందో ఏంటో కానీ... ఆమె వ్యక్తిగతంగా మాత్రం మెగా కాంపౌండ్ కి బాగా దగ్గరైపోయింది. అల్లు అర్జున్ కూడా `కొత్తజంట` ఆడియో వేడుకలో రెజీనాతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు. అంటే ఆమె ఏ రేంజ్ లో మెగా హీరోల్ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. రెజీనా కూడా మెగా హీరోయిన్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతానంటుంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేని పురస్కరించుకొని తన అభిమానాన్ని ఓ రేంజ్ లో చాటి చెప్పింది. డబ్ స్మాష్ లో బోలెడన్ని చిరంజీవి డైలాగులు చెప్పేసి పోస్ట్ చేస్తోంది. ఆమె సందడిని చూసి `నువ్వు నిజంగా మా మెగా హీరోయిన్ వే` అంటున్నారు అభిమానులు.
హీరోయిన్లు హీరోయిన్ల డైలాగులు చెబుతూ డబ్ స్మాష్ లో మెరుస్తుంటారు. కానీ రెజీనా మాత్రం చిరు డైలాగుల్ని చెప్పింది. తెలుగు అంత స్పష్టంగా రాకపోయినా సరే... మెగా స్టార్ పై ఉన్న అభిమానంతో పదుల సంఖ్యలో డైలాగుల్ని భట్టీపట్టి చెప్పడం విశేషం. ఆమె డైలాగులు పలుకుతున్న విధానం, ఎక్స్ప్రెషన్స్ మెగా అభిమానుల్ని బాగా ఆకట్టుకొంటున్నాయి. మొత్తమ్మీద మెగాస్టార్ బర్త్ డేని బాగానే సద్వినియోగం చేసుకొన్నట్టుంది రెజీనా. ఇంతటి మెగా భక్తి చూపాక ఆమెకి మళ్లీ మళ్లీ మెగా హీరోలతో కలిసి నటించే అవకాశం ఎందుకు రాదూ!