ఈసారి ఆమె లెటర్ తో అమీర్ కంటతడి

Update: 2017-02-17 08:02 GMT
భావోద్వేగం కాస్త ఎక్కువ ఉన్న వారితో కొద్దిపాటి ఇబ్బందే. వారు తమ ఎమోషన్స్ ను ఆపుకోలేరు. ఇదేమీ తప్పుకాకున్నా.. ఆ మాత్రం కంట్రోల్ లేకపోతే ఎలా అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. సాదాసీదా జనం సంగతి పక్కనపెడితే.. సెలబ్రిటీలు ఎమోషనల్ అయితే.. అది కచ్ఛితంగా వార్తే అవుతుంది. అందుకే.. తమ భావోద్వేగాల్ని బయట పడకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

అదే సమయంలో ఇలాంటి జాగ్రత్తల్ని పట్టించుకోకుండా ఉండే వారూ కనిపిస్తారు. అలాంటి జాబితా ఒకటి తయారు చేస్తే.. అందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమీర్ ఖాన్ పేరు పక్కాగా ఉంటుంది. మిగిలిన వారితో పోలిస్తే ఆయనలో భావోద్వేగం పాళ్లు కాస్తఎక్కువే. ఎంతంటే.. ఆ మధ్యన సల్మాన్ నటించిన భజరంగీ భాయిజాన్ సినిమా చూస్తే ఎమోషన్స్ ని ఆపుకోలేక కంటతడి పెట్టేశాడు. ఆ మధ్య సంచలన విజయంసాధించిన మరాఠీ చిత్రం సైరాత్ సినిమా చూసేటప్పుడూ భావోద్వేగాల్ని ఆపులేక కంట తడి పెట్టేశారు.

తాజాగా ఆయన నటించిన దంగల్ చిత్రం.. రికార్డుకలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపి సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా ఘన విజయం నేపథ్యంలో ఒక కార్యక్రమాన్నినిర్వహించారు. దీనికి వచ్చిన ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ.. అమీర్ కు ఒక లేఖను ఇచ్చారు. దాన్ని చదివిన అమిర్ కంట కన్నీరు పెట్టించిందట. దంగల్ లో అమిర్ నటనను రేఖ ప్రశంసించిందట. సినిమానుచూసిన ఆమె ఎమోషనల్ కావటమే కాదు.. అతగాడ్ని పొగిడేస్తూ రాసిన వ్యాక్యాలు అమిర్ కంట కన్నీరు తెప్పించేశాయట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News