గురులో రేలంగి వారమ్మాయి సెన్సేషన్

Update: 2017-04-13 06:11 GMT
దర్శకుడు రేలంగి నాగేశ్వరరావు మేనకోడలు రేలంగి ఉమా మహేశ్వరి. తన పరిచయం ఇలా ఉండాల్సిన అవసరం లేని స్థాయికి ఇప్పటికే చేరుకుంది ఉమా మహేశ్వరి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తగినంత గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటివరకూ తమిళ్ చిత్రాలకు డబ్బింగ్ చెబుతూ.. పలు అవార్డులను కూడా దక్కించుకోవడం విశేషం.

తాజాగా గురు చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఈమె డబ్బింగ్ చెప్పగా.. ఉమా మహేశ్వరి వాయిస్.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. తెలుగు అమ్మాయే అయినా.. చెన్నైలోనే పెరిగిన ఈమెకు తొలి తెలుగు స్ట్రెయిట్ సినిమా గురునే కావడం విశేషం. అసలు ఇండస్ట్రీలోకే అనుకోకుండా వచ్చానని చెబుతుంది ఉమా మహేశ్వరి. 'నా స్నేహితురాలికి తోడుగా ఆడిషన్ కు వెళ్లినపుడు ఓ ప్రయత్నం చేశానంతే. ఈ ఫీల్డ్ లో నా కెరీర్ ను ముందుగా ఊహించుకోలేదు. కానీ 2010 లో కలవాణి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తర్వాత బిజీ అయిపోయాను. ఆ తర్వాత పలు ఛాలెంజింగ్ రోల్స్ కు డబ్బింగ్ చెప్పాల్సి రావడం నా అదృష్టం' అని చెప్పింది రేలంగి ఉమా మహేశ్వరి.

'దాదాపు 50 సినిమాలకు డబ్బింగ్ చెప్పినా మొదటిసారిగా తెలుగు మూవీకి వర్క్ చేయడం విభిన్నమైన అనుభూతి. ఇరుదు సూత్రుకు నేనే డబ్బింగ్ చెప్పడంతో ఈ పాత్రలోని ఎసెన్స్ నాకు తెలుసు. తమిళ్ వెర్షన్ కు 15 రోజులు పట్టగా.. తెలుగు వెర్షన్ గురు డబ్బింగ్ ను 5 రోజుల్లోనే పూర్తి చేయగలిగాను. నా డబ్బింగ్ కు వస్తున్న రెస్పాన్స్ ఎంతో సంతోషాన్ని ఇస్తోంది' అని చెబుతోంది రేలంగి ఉమా మహేశ్వరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News